cloudfront

Advertisement


Home > Politics - Gossip

కాంగ్రెస్ టికెట్లకూ డిమాండ్! బాబు పుణ్యమేనా!

కాంగ్రెస్ టికెట్లకూ డిమాండ్! బాబు పుణ్యమేనా!

ఏపీలో కాంగ్రెస్ పార్టీ టికెట్లకూ ఎనలేని పోటీ ఉందట. ఆ విషయాన్ని స్వయంగా ప్రకటించుకుని ఆనందపడ్డారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నాలుగు రోజుల పాటు టికెట్ ల కోసం దరఖాస్తులు చేసుకునే ప్రకటనను చేసింది ఏపీ పీసీసీ. ఈ నేపథ్యంలో తొలిరోజే రెండు వందలకు పైగా అప్లికేషన్లు వచ్చాయట. ఈ లెక్కన మరో మూడు రోజుల్లో.. ఎన్ని అప్లికేషన్లు వస్తాయో చూడాల్సి ఉంది.

ఒక్కో నియోజకవర్గం నుంచి నాలుగైదుకు మించి అప్లికేషన్లు వస్తాయేమో! కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి కూడా ఇంత డిమాండ్ ఉందంటే ఆసక్తిదాయకమే. బహుశా కాంగ్రెస్ లోనే టికెట్ల కోసం ఇంత డిమాండ్ ఉందేమో. తెలుగుదేశంలో అయినా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అయినా అంత డిమాండ్ ఉండకపోవచ్చు.

ఎందుకంటే.. ఆ పార్టీల్లో ఎవరు పోటీచేస్తారు.. అనే అంశంపై ఎంతోకొంత స్పష్టత ఉంటుంది. అయితే కాంగ్రెస్ లో ఎవరు పోటీచేస్తారో ఎవరికీ తెలియదు కాబట్టి.. చాలామంది తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఉండవచ్చు.

అందులోనూ పార్టీ ఏమైనా ఫండ్ ఇస్తుందేమో అనే ఆశలూ ఉంటాయి. సరదాగా మూడునెలలు ఆ ఫండ్ తో మందిని వెంటేసుకుని తిరిగేయొచ్చు. అలాగే ఈసారి కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు భారీగా ధన సహాయం చేస్తారనే పుకారు కూడా ఒకటి ఉంది.

ఓట్లు చీల్చే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీని బరిలో నిలుపుతున్నారని.. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఖర్చు కూడా ఆయనే పెట్టుకుంటారని కాంగ్రెస్ వాళ్లే ఒక టాక్ మొదలుపెట్టారు. మీడియాకు ఆఫ్ ద రికార్డుగా ఈ విషయాన్ని వారు చెబుతున్నారు.

నియోజకవర్గాలను బట్టి.. బాబు ఫండ్స్ ఇవ్వబోతున్నారని.. అందుకే కాంగ్రెస్ తరఫు నుంచి పోటీకి చాలామంది పోటీలో ఉన్నారని కాంగ్రెస్ నేతలే అంటున్నారు.

జగన్ ముందు బాబు నిలబడలేరు: వాకా మంజుల