Advertisement

Advertisement


Home > Politics - Gossip

గంటా రాజీనామా.. ఉత్తుత్తిదేనా!

గంటా రాజీనామా.. ఉత్తుత్తిదేనా!

విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్ర‌భుత్వం ప్రైవేట్ ప‌రం చేయ‌డాన్ని నిర‌సిస్తూ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్టుగా ప్ర‌క‌టించారు తెలుగుదేశం నేత గంటా శ్రీనివాస‌రావు. ఈ విష‌యంలో త‌న పోరాటం సాగుతుంద‌ని, త్వ‌ర‌లోనే పొలిటిక‌ల్ జేఏసీని కూడా ఏర్పాటు చేయ‌నున్న‌ట్టుగా ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే ఈ పోరాటాన్ని ఆయ‌న తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున చేప‌ట్ట‌డం లేదు. త‌న వ్య‌క్తిగ‌తంగా చేప‌డుతున్న‌ట్టుగా స్పందించారు.

రాజీనామా అస్త్రాన్ని కూడా సంధించారు. ఈ విష‌యంపై టీడీపీ స్పందిచ‌డం లేదు. ఒక‌వేళ టీడీపీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ క‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తున్న‌ట్టుగా అయితే ఒక్క గంటా రాజీనామా చేస్తే అది కామెడీ అవుతుంది. రాజీనామాలు అంటూ మొద‌లైతే.. చంద్ర‌బాబుతో స‌హా అంతా రాజీనామాలు ఇవ్వాలి. అందుకే గంటా రాజీనామాపై టీడీపీ కిక్కురుమ‌నే ప‌రిస్థితుల్లో లేదు. 

ఇక గంటా శ్రీనివాస‌రావు రాజీనామా కూడా ఉత్తుత్తిగానే ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న రాజీనామాను ఆమోదించ‌డానికి త‌గిన‌ట్టుగా లేద‌ని స‌మాచారం. త‌న రాజీనామాకు ప్ర‌త్యేక కార‌ణాన్ని తెలియ‌జేశార‌ట గంటా. అది కూడా ఒకవేళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ జ‌రిగితే.. అనే ష‌ర‌తును విధించార‌ట‌! ష‌ర‌తులు పెట్టి స్పీక‌ర్ కు రాజీనామా ప‌త్రం ఇవ్వ‌డం కామెడీ అని స్ప‌ష్టం అవుతోంది. రాజీనామా అంటే, రాజీనామా లాగా ఉంటే స్పీక‌ర్ ఆమోదించ‌వ‌చ్చ‌ని, గంటా ఇచ్చిన రాజీనామా స్పీక‌ర్ ఫార్మాట్ లో లేద‌ని స్ప‌ష్టం అవుతోంది.

ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ అంశంపై రాష్ట్ర ప్ర‌భుత్వంపై దుమ్మెత్తి పోస్తోంది టీడీపీ. కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంటే.. కిక్కురుమ‌నే ప‌రిస్థితి లేక‌, రాష్ట్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తూ.. క‌సి తీర్చుకుంటూ, ప్ర‌జ‌ల‌ను వెర్రివాళ్ల‌ను చేసే ప్రోగ్రామ్ పెట్టుకుంది టీడీపీ.

మెగాస్టార్ చిరంజీవి ఆ రిస్కు తీసుకుంటారా?

మెగాఫ్యామిలీ మొత్తానికి నచ్చేసింది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?