Advertisement

Advertisement


Home > Politics - Gossip

గంటా డుమ్మా.. సంకేతాలు ఇస్తున్నట్టే?

గంటా డుమ్మా.. సంకేతాలు ఇస్తున్నట్టే?

అసెంబ్లీ సమావేశాల్లో గంటా శ్రీనివాసరావు ఉలుకూపలుకూ లేకుండా కూర్చున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడేమో ఆయన పులివెందులకు వెళ్లి మరీ మాట్లాడారు. పులివెందుల్లో జగన్ ను ఓడిస్తామని ప్రకటించి వచ్చారు. మరి అప్పుడు అంతలా బీరాలు పలికిన వ్యక్తి తీరా తమ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాకా, పులివెందుల్లో జగన్ మెజారిటీ అంతకంతకూ పెరిగిన తర్వాత మాత్రం కామ్ అయిపోయారు!

దీంతో ఎవరి అనుమానాలు వారికి వచ్చాయి. గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అవుతున్నారనే పుకార్లకూ కొదవలేదు. ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని, కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు అనేమాట వినిపిస్తూ ఉంది. అయితే గంట మాత్రం మోగడంలేదు. తనపై వస్తున్న పుకార్లకు కూడా గంటా సమాధానం చెప్పడంలేదు. వాటితో తనకు సంబంధం లేదన్నట్టుగా కామ్ గా ఉన్నారాయన. ఆ సంగతలా ఉంటే.. చంద్రబాబు నాయుడు టీడీపీ విస్తృత స్థాయి భేటీ అంటూ పిలిచినా గంటా శ్రీనివాసరావు హాజరు కాకపోవడం గమనార్హం.

పార్టీలో అలకల నేతలను, పార్టీ వీడతారనే నేతలనూ ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో విస్తృతస్థాయి సమావేశానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి గైర్హాజరు అయిన నేతల్లో గంటా శ్రీనివాసరావుతో పాటు ఏం మాట్లాడుతున్నారో అర్థంకాకుండా తెలుగుదేశం పార్టీపై నిరసన స్వరం కాసేపు, భజన స్వరం కాసేపు వినిపిస్తున్న కేశినేని నాని కూడా ఉన్నారు. వీరిద్దరూ టీడీపీ విస్తృత స్థాయి భేటీకి హాజరుకాలేదని తెలుస్తోంది. మరి ఈ గైర్హాజరీ తర్వాత వీరు చంద్రబాబుకు ఏవో సంకేతాలను గట్టిగానే ఇస్తున్నట్టున్నారని పరిశీలకులు అంటున్నారు.

ప్రాంతీయ భాషల సినిమాలు అదుర్స్!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?