cloudfront

Advertisement


Home > Politics - Gossip

గ్రేట్ ఆంధ్ర గ్రౌండ్ రిపోర్ట్.. నెల్లూరు అర్బన్

గ్రేట్ ఆంధ్ర గ్రౌండ్ రిపోర్ట్.. నెల్లూరు అర్బన్

రాష్ట్రంలో ఓటు రేటు అత్యధికంగా పలకగలదు అని అని అంచనా వేయగల నియోజకవర్గం ఇది. అందుకు కారణం.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంత్రి నారాయణ పోటీ చేస్తూ ఉండటమే! ప్రత్యక్ష రాజకీయాల వైపు వచ్చాకా టీడీపీ తరఫున నామినేటెడ్ పదవిని తీసుకుని మంత్రి అయ్యారు నారాయణ. అలా తెలుగుదేశంపై తనకున్న పట్టేమిటో నిరూపించుకున్నారు. ఇక అంతటితో ఆగక.. నారాయణ ప్రత్యక్ష రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చారంటే.. ఆయన తన విజయం మీద ఎంత నమ్మకంతో ఉన్నారో, ఎంత ప్రతిష్టగా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

విద్యాసంస్థల యజమానిగా ఉన్నప్పుడు ‘నెల్లూరు నారాయణ’గా ఫేమస్ అయిన ఈయన ఇప్పుడు నెల్లూరు అర్బన్ నుంచినే తనసత్తా చూపించబోతూ ఉన్నారు. దీనికోసం పక్కా ప్రణాళికతో ఉన్నారాయన. ఆ విషయం గ్రౌండ్ లెవల్ పరిశీలనతో స్పష్టం అవుతోంది.

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనిల్ కుమార్ యాదవ్ గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. అంతకు ముందు ఒక దఫా కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిన ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రం నెగ్గారు. బీసీ ఓటు బ్యాంకు సాలిడ్ గా పడటం, కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు వైసీపీ వైపు టర్న్ కావడంతో.. గతసారి అనిల్ కుమార్ యాదవ్ విజయం నల్లేరు మీద నడక అయ్యింది. 

ఈసారి డిసైడింగ్ ఫ్యాక్టర్లు ఇవే..
-అనిల్ కుమార్ యాదవ్ కు ఈసారి ఏమాత్రం తేలికకాదు. గట్టిపోటీ కాదు, తీవ్రమైన పోటీ ఉంటుంది.
-నారాయణ చాలా వ్యూహాత్మకంగా వెళ్తూ ఉన్నారు. ఆర్థికబలం విషయంలో నారాయణకు తిరుగు లేదని చెప్పనక్కర్లేదు.
-నారాయణతో పోల్చినప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఆర్థిక శక్తి ఏ మూలకూ చాలదు!
-అనుకూల పరిస్థితి లేకపోతే నారాయణ ఇక్కడ పోటీచేసి పరువు పోగొట్టుకొనే ప్రయత్నం చేయరు కదా! అనే కామెంట్లు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి.
-నెల్లూరు అర్బన్ సీట్లో ఇప్పటికే ఓట్ల కొనుగోలు భారీగా సాగుతోందని సమాచారం. పార్టీ కండువా కప్పుకుని తిరిగే వారుంటే ఇంటికి పదివేలు కూడా ఆర్థికశక్తి గట్టిగా ఉన్న అభ్యర్థి బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. పోలింగ్ నాటికి ఓటుకు  పదివేల రూపాయలు అయినా ఇవ్వగలరు.. అని ఆయన విషయంలో ప్రచారం జరుగుతూ ఉంది!
-వైశ్యుల ఓట్లను వ్యూహాత్మకంగా సొంతం చేసుకునే యత్నంలో ఉన్నారట నారాయణ. 
-మొత్తం గ్రేటర్ రాయలసీమ పరిధిలో జనసేనకు మంచి ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గం నెల్లూరు అర్బన్! ప్రజారాజ్యం గెలిచిన సీటు ఇది అనే విషయం గుర్తు చేయాలిక్కడ.
-మెగా అభిమానగణం గట్టిగా ఉంది. జనసేన కూడా ఇక్కడ ధీటైన అభ్యర్థిని నిలిపితే పోరు ముక్కోణం కావడం గ్యారెంటీ. అయితే నారాయణతో పవన్ కల్యాణ్ కు సన్నిహిత సంబంధాలున్నాయని అంటారు. అలాంటి చోట ఆయనను దెబ్బతీయడానికి పవన్ కల్యాణ్ అభ్యర్థిని పెడతారా? పోరడతారా? అనేది సందేహమే.
-ప్రజారాజ్యం పార్టీ నెగ్గిన సీటే అయినా.. జనసేన తొలి జాబితాలో నెల్లూరు అర్బన్ కు అభ్యర్థిని ప్రకటించలేదంటే పరిస్థితిని సూఛాయగా అర్థం చేసుకోవచ్చు.

గ్రేట్ ఆంధ్ర పరిశీలనలో తేలిన ఓట్ల శాతం..

తెలుగుదేశం పార్టీ-40
వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ –38
జనసేన -22

కర్నూలు ఎంపీ సీటు YCPకి ఇబ్బందులు తప్పవు

సావిత్రి, క్రీడాకారుల సినిమా చూశారే! మరి ఎన్టీఆర్ దే ఎందుకిలా?