cloudfront

Advertisement


Home > Politics - Gossip

జానారెడ్డికి గ్రీన్ సిగ్నల్ లభించినట్టేనా?

 జానారెడ్డికి గ్రీన్ సిగ్నల్ లభించినట్టేనా?

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు తమ తమ కుటుంబీకులకు కూడా సీట్లను గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎవరికి వారు..తమతో పాటు తమ కుటుంబంలోని ఒకరిద్దరికి సీట్లను ఖరారు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే నాలుగు కుటుంబాల వాళ్లు మొత్తం సీట్లను సొంతం చేసుకునే ప్రయత్నాల్లో ఉండటం విశేషం.

ముందుగా సిట్టింగులు.. తర్వాత వాళ్ల కుటుంబీకులు..అంతా వీళ్లే పోటీ చేసే ప్రయత్నాల్లో ఉండటం గమనార్హం. కోమటిరెడ్డి సోదరులు చెరో నియోజకవర్గం సాధించుకునే యత్నంలో ఉన్నారు. వీరిలో ఒకరు సిట్టింగ్.. మరొకరు ఇప్పుడు రంగంలోకి దిగే ప్రయత్నంలో ఉన్నారు. టికెట్ దాదాపు ఖరారు అయినట్టే.

ఇక పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఆయన భార్య ఇప్పటికే సిట్టింగులు.. వీళ్లకూ టికెట్లు ఖరారే. ఇక ఇదే జిల్లాలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి తన తనయుడిని కూడా పోటీ చేయించాలని భావిస్తున్నాడు. రాంరెడ్డి కుటుంబానికి రెండు టికెట్లు కొత్త ఏమీ కాదు. గతంలో రాంరెడ్డి సోదరుడు రంగంలోకి దిగేవారు. అయితే ఆయన ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేసే వారు. అన్నదమ్ములిద్దరూ చెరో జిల్లాలో పోటీ చేసే వారు. ఇప్పుడు దామోదర్ రెడ్డి మాత్రం తన తనయుడిని నల్లగొండ జిల్లాలోని ఒక సీట్లో రంగంలోకి దింపాలని చూస్తున్నాడని సమాచారం.

ఇక పెద్దలు జానా రెడ్డి.. ఈ సారి రిటైర్మెంట్ తీసుకుంటాడని అనుకుంటే, ఈయన.. తనతో పాటు తనయుడిని కూడా రంగంలోకి దించే యత్నంలో ఉన్నాడని సమాచారం. తను ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జున సాగర్ సీట్లో తనయుడిని పోటీ చేయించి, తను మిర్యాలగూడా వెళ్తానని జానా చెబుతున్నాడట. మొత్తంగా నల్లగొండ జిల్లా మొత్తాన్నీ నాలుగు కుటుంబాలు హస్తగతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా ఉన్నాయి.