cloudfront

Advertisement


Home > Politics - Gossip

భారీ మొత్తాలతో పట్టుబడుతున్న టీటీడీపీ నేతలు!

భారీ మొత్తాలతో పట్టుబడుతున్న టీటీడీపీ నేతలు!

ఒకవైపు నీతులు, నైతిక విలువల.. గురించి చంద్రబాబు నాయుడు తెలంగాణలో లెక్చర్లు ఇస్తున్నాడు. ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారంటూ ఫిరాయింపుదారులను తిడుతున్నాడు. బాబు ఇలా గురివింద చందంగా మాట్లాడుతుంటే.. అవతల టీడీపీ వాళ్లు మాత్రం భారీ మొత్తాలతో పట్టుబడుతున్నారు.

శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్యా ఆనంద్ ప్రసాద్ తనయుడి కారులో ఏకంగా డెబ్బై లక్షల రూపాయల మొత్తం పట్టుబడటం గమనార్హం. ముందస్తు సమాచారంతో ఆనంద్ ప్రసాద్ తనయుడి కారులో పోలీసులు సోదాలు నిర్వహించగా ఈ కళ్లుచెదిరే స్థాయి మొత్తం దొరికినట్టుగా తెలుస్తోంది.

ఒక్కదెబ్బకే మరీ డెబ్బై లక్షల రూపాయల మొత్తం అంటే.. టీడీపీకి గట్టిదెబ్బ పడినట్టే. ఒక్కో నియోజకవర్గంలో టీడీపీ ఐదుకోట్ల రూపాయల వరకూ ఖర్చుచేస్తుందనే అంచనాలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. పట్టుబడ్డ డెబ్బై లక్షల రూపాయల మొత్తాన్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పటి వరకూ తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాకా.. ఇలాంటి అనుమానాస్పద మొత్తాలను పోలీసులు భారీఎత్తున స్వాధీన పరుచుకోవడం విశేషం. మరోవైపు అమీర్ పేట్ ఏరియాలో కూడా టీడీపీ కార్యకర్తల వద్ద భారీగా డబ్బు దొరికిట్టుగా వార్తలు వస్తున్నాయి.

సనత్ నగర్ ఏరియాలో పంచేందుకు తమ్ముళ్లు ప్రయత్నిస్తుండగా.. తెరాస కార్యకర్తలు వారితో గొడవకు దిగినట్టుగా తెలుస్తోంది. గొడవను సద్దుమణిగేలా చేయడానికి పోలీసులు కూడా రంగంలోకి దిగారు. చివరకు టీడీపీ కార్యకర్తల కార్లలో సోదాలు నిర్వహించగా.. భారీ మొత్తాలు దొరికినట్టుగా తెలుస్తోంది.

ఏపీ నుంచి వెళ్లిన టీడీపీ కార్యకర్తలు సనత్ నగర్  ఏరియాలో పంపకాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది.

ఆ పార్టీకి మినిమం మెజారిటీ గ్యారెంటీ!... ఎందుకో తెలుసా?