cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఇది కూడా 'కమ్మ'నైన సర్వేనే.!

ఇది కూడా 'కమ్మ'నైన సర్వేనే.!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సర్వే బొక్క బోర్లాపడింది. ఈ సర్వేని నమ్ముకుని, చాలామంది కోట్లలో నష్టపోయారు. ఈ నష్టం అంతా ఇంతాకాదనీ, కనీవినీ ఎరుగని రీతిలో లగడపాటి రాజగోపాల్‌ సర్వే ఆంధ్రప్రదేశ్‌లో చాలామందిని ముంచేసిందనీ జనం గగ్గోలు పెడ్తోన్న సంగతి తెల్సిందే. టీఆర్‌ఎస్‌ గెలుస్తుందంటూ తొలుత బెట్టింగులు జరిగినా, చివరి నిమిషంలో లగడపాటి సర్వేతో.. బెట్టింగుల సీన్‌ మారిపోయింది. అదే, బెట్టింగ్‌లో చాలామంది డబ్బులు కోల్పోవడానికి కారణమైంది కూడా.!

'అబ్బే, నేనెప్పుడూ బెట్టింగుల్ని ప్రోత్సహించను..' అని లగడపాటి చెప్పొచ్చుగాక. కానీ, ఎన్నికల పోలింగ్‌కి ముందే, ఫలితంపై లగడపాటి రాజగోపాల్‌ తన సర్వేకి సంబంధించి ఆసక్తికరమైన వివరాలు వెల్లడించాక, గతంలో ఆయన సర్వేలు నిజం కావడంతో.. ఆటోమేటిక్‌గా అటువైపు కొంతమంది ఆసక్తి చూపారు, బొక్క బోర్లాపడ్డారు. ఇప్పుడు బాధితులంతా లగడపాటి రాజగోపాల్‌ని బండబూతులు తిట్టుకోవాల్సి వస్తోంది.

ఇదిలావుంటే, ఇంకో సర్వే కూడా జరిగిందట ఆంధ్రప్రదేశ్‌ నుంచి. అది కూడా అధికార పార్టీకి చెందిన ఓ నేత, సొంతంగా ఆ సర్వే నిర్వహించారట. ఆ సర్వేలో, టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని తేలిందట. ప్రజాకూటమి ప్రభావం ఏమీ వుండదని, సదరు టీడీపీనేత.. తమ అధినేతకు విన్నవించారట కూడా. ఆయన చెప్పినట్టే అంతా జరిగిందట.

ఆ 'కమ్మ'నైన సర్వే గురించి పూర్తిగా విశ్లేషించాకే, చంద్రబాబు అత్యంత వ్యూహాత్మకంగా లగడపాటి రాజగోపాల్‌ని రంగంలోకి దించినట్లు ప్రచారం జరుగుతోంది. అన్నట్టు, సదరు టీడీపీ ఎంపీ ఇంకో సర్వే కూడా చేశారటండోయ్‌. ఈ సర్వే, ఆంధ్రప్రదేశ్‌ గురించి అట.

2019 ఎన్నికల్లో టీడీపీకి 100 సీట్లకు పైగానే వస్తాయని సదరు ఎంపీగారి సర్వేలో తేలిందన్నది కూడా ఓ 'కమ్మ'నైన వార్త. 'కమ్మ' కమ్మగా ఈ వార్తని వడ్డించి పారేసింది 'కమ్మ'టి ఓ మీడియా సంస్థ. చూస్తోంటే, 'కమ్మ' కమ్మగా అడ్డగోలు సర్వేల్ని ప్రచారంలోకి తీసుకొచ్చి, అమాయకుల్ని ముంచేసి, తాము ఆర్థికంగా లాభపడాలనే ఆలోచన టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా చేసినట్లే కన్పిస్తోంది.

కేసీఆర్, బాబు పాలనపై సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే?

వెల్లువెత్తిన అభిమానం మినిష్టర్ క్వార్ట్రర్స్ జామ్ ఎక్కడంటే