cloudfront

Advertisement


Home > Politics - Gossip

డోన్.. యివ్వకుంటే వైకాపాలోకి!

డోన్.. యివ్వకుంటే వైకాపాలోకి!

కర్నూలు జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టిడిపిలో చేరికకు డోన్ సీటు అడ్డంకిగా మారుతున్నట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లా రాజకీయాలలో కోట్లకు బద్ధశత్రువుగా పేరొందిన జిల్లా తెలుగుదేశం సీనియర్ నేత, ఉపముఖ్యమంత్రి... కేఈ కృష్ణమూర్తి ఈ సీటు కోసం పట్టుబడుతున్నారు. దీనికోసమే ప్రయత్నిస్తున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి డోన్ సీటే... తెలుగుదేశంలో చేరికకు అడ్డంకిగా మారుతున్నట్లు కనపడుతోంది.

కేఈ కృష్ణమూర్తి తన తమ్ముడైన కే.ఈ ప్రభాకర్ కోసం డోన్ సీటు అడుగుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన తన భార్య కోట్ల సుజాతమ్మకు ఇదే సీటును కట్టబెట్టాలనేది కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పట్టుదలగా కనపడుతోంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కర్నూలు ఎంపీ టికెట్ కేటాయించేందుకు... తెలుగుదేశం పార్టీకి పెద్ద ఇబ్బందులు లేనప్పటికీ, డోన్ నియోజకవర్గం కేటాయింపే... కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.

ఆది నుంచి వైరి వర్గాలుగా ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి... కేఈ కృష్ణమూర్తి కుటుంబాలు రెండూ ఇదే సీటు కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుండటంతో చంద్రబాబుకు డోన్ సీటు విషయం పెద్ద తలనొప్పిగా మారింది. డోన్ విషయంలో డోలాయమాన పరిస్థితికి ఫుల్ స్టాపన్ పెడితే తప్ప... కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరే విషయం ఒక కొలక్కి వచ్చే అవకాశం లేదు.

మరి చంద్రబాబు- ఇన్నాళ్లుగా పార్టీకి ఆధరవుగా, పెద్దదిక్కుగా ఉన్న కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి మద్దతునిస్తారో... లేక వారికి సర్దిచెప్పి... కొత్త చేరికల కోసం ఉత్సాహపడి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబీకులకు డోన్ సీటు ఇస్తారో చూడాల్సి ఉంది.

డోన్ విషయంలో ఇరువురూ గట్టిగా పట్టుబడుతుండగా.. కోట్ల అనుచరులతో నిర్వహించిన సమావేశంలో.. తెదేపా వద్దు, వైకాపాలో చేరాలని పలువురు సూచించినట్లుగా కొన్ని ఫీలర్లు వస్తున్నాయి. అంటే.. ప్రస్తుతానికి కోట్ల రెండు పార్టీలకూ సంకేతాలు పంపుతున్నట్లుగా కనిపిస్తోంది. తన పార్టీ ఎలా అయిపోయినా పర్లేదు గానీ.. ప్రత్యర్థి బలపడకూడదని భావించే చంద్రబాబు ఏం ఎత్తుగడ వేస్తారో చూడాలి.

కీలకమైన 'పోల్‌ మేనేజిమెంట్‌' జగన్ ఎదుర్కోగలడా?