cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఇక పవన్ ను ఇక్కడ వాడతారా?

ఇక పవన్ ను ఇక్కడ వాడతారా?

రాజుల పాలనలో మంచి సేనాధిపతి, ట్రబుల్ షూటర్ లాంటి వాళ్లు వుండేవారు. ఏదైనా అవసరం వచ్చినపుడు, ఏ సామ్రాజ్యాన్నైనా స్వాధీనం చేసుకోవాలనుకునే సమయంలో వాళ్లను పంపేవారు. ప్రజాస్వామ్యం వచ్చాక కాంగ్రెస్ పార్టీలో ఈ ట్రబుల్ షూటర్లు జనాలకు అలవాటయ్యారు. ఏ రాష్ట్రంలోనైనా సమస్య వస్తే అక్కడికి వాళ్లను పంపేవారు. వాళ్లు తమ చాకచక్యంతో పని సాధించుకువచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలా తయారైనట్లు కనిపిస్తోంది.

నవ్విపోదురు గాక, నాకేటి సిగ్గు, నా ఇచ్ఛయే గాక నాకేటి వెరపు అన్నట్లుగా ఆయన తన జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా నడుపుతూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో అది చాలా స్పష్టంగా కనిపించింది. పైకి బులి బులి ఏడుపుల మాదిరిగా, ఏదో ఓ మాట తెలుగుదేశం పార్టీ మీద తప్ప, నిర్దిష్టంగా ఆ పార్టీకి వ్యతిరేకంగా పవన్ చేసింది లేదు. ఎక్కడ వైకాపా బలంగా వుందో, అక్కడ బలమైన జనసేన అభ్యర్థులను నిలపడం వంటి రకరకాల ఫీట్లు చేసారు.

కాపుల ఓట్లు ఎటూ పోకుండా తన పార్టీకే వచ్చేలా చేసారు. ఆఖరికి ఆయన కోసం తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులనే వెనక్కు తగ్గేలా చేసిన వైనం కూడా గాజువాకలో చూసాం. ఇప్పుడు నిన్నటికి నిన్న మీడియా టైకూన్ రామోజీ మనవరాలి పెళ్లిలో పవన్-బాబు ఒకరికి ఒకరు తారసపడ్డారు. కనపడగానే వినయంగా చేతులు జోడించి పవన్ నమస్కరించి, ఆపై స్కూలు పిల్లాడిలా చేతులు కట్టుకుని వినయంగా నిల్చోవడం, 'మంచి పని చేసావ్.. శభాష్' అనేట్లుగా బాబుగారు భుజం తట్టడం, ఇద్దరు ముసిముసి నవ్వులు నవ్వుకోవడం వీడియోల్లో క్లియర్ గా రికార్డయియింది.

ఇప్పుడు జనసేన తెలంగాణ జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తుందట. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దుకాణం ఎత్తేసిన సంగతి తెలిసిందే. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో పోటీనే చేయలేదు ఈ జాతీయపార్టీ కమ్ ప్రాంతీయ పార్టీ. అలాగే జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేదీ లేనిదీ చెప్పనేలేదు. పైగా మొన్నటి ఆంధ్ర ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని అంతగా టార్గెట్ చేసిన చంద్రబాబు ఇప్పుడు జిల్లా పరిషత్ ఎన్నికలకు దిగుతారు అంటే అనుమానమే. ఎందుకంటే తెరాస కచ్చితంగా ఆ స్పీచ్ లు అన్నీ ఇక్కడ రీప్లే చేసి సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తుంది. సో, తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి అది. 

ఇలాంటి టైమ్ లో జనసేన ఇలా ప్రకటించడంపై రాజకీయ వర్గాలు పరిశీలన చేస్తున్నాయి. మరో అయిదేళ్ల తరువాత కోసం ఇప్పటి నుంచి జనసేనను బాబు ప్రిపేర్ చేస్తున్నారని అనుమానిస్తున్నాయి. ఆంధ్రలో దారుణంగా అభాసు కాబోతున్నారని వార్తలు అందుతున్న నేపథ్యంలో పవన్ తెలంగాణలో పీకేది పెద్దగా వుండకపోవచ్చు. కానీ శిఖండి నేరుగా బాణం వేయలేదు భారతంలో, కానీ భీష్ముడు నేలకు ఒరిగేలా చేయడానికి పనికి వచ్చింది. 

అదేవిధంగా పవన్ పార్టీని తెరాసను దెబ్బతీయడానికి జనసేనను వాడుకోవడానికి చూస్తున్నట్లుంది. ఎందుకంటే తెలంగాణలో కాపుల సంఖ్య ఎక్కువగానే వుంది. అందువల్ల మరికొన్ని రోజులపోతే, పవన్ స్పీచ్ లు, వ్యూహాలు బయటకు వస్తే, మరింత క్లారిటీ వస్తుంది అంటున్నాయి రాజకీయ వర్గాలు.

రాష్ట్ర రాజకీయంలో ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది?

జెర్సీ గురించి నాని చెప్పిన నిజాలేంటి