Advertisement


Home > Politics - Gossip
ఐలయ్య.. ఏమిటీ పెంటయ్యా..!

మిగతా ప్రపంచం సంగతి వదిలేద్దాం.. ఈ దేశంలో ఆర్యవైశ్యులు మాత్రమే వ్యాపారాలు చేస్తున్నారా? మరెవరూ చేయట్లేదా? ఈ ప్రశ్నకు ఏ మాత్రం కామన్ సెన్స్ ఉన్న వాళ్లైనా సమాధానం ఇస్తారు. వ్యాపారం చేస్తున్నది, కిరాణా కొట్లు నడుపుతున్నది, కేవలం కోమటోళ్లు మాత్రమే కాదు, వీధిలోకి వెళ్లి చూస్తే.. కోమటోళ్ల కొట్ల కన్నా, మిగతా కులస్తుల కొట్లు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం అవుతుంది. లెక్క ప్రకారం.. ఎవరైనా శాస్త్రీయంగా సర్వే చేసినా.. కోమట్ల ఆధ్వర్యంలోని వ్యాపారాలు, కొట్లు పదిశాతం లోపే అని స్పష్టం అవుతుంది.

ఇప్పుడు ఫలానా కులమే ఫలానా పని చేయాలనే రూల్ లేదు. కంచె ఐలయ్య వంటి మేధావులకే ఈ విషయాలు అర్థం అవుతున్నట్టుగా లేవు. యాదవులు మాత్రమే పశువులు మేపట్లేదు, కురుబలు మాత్రమే గొర్రెలు మేపడం లేదు, మంగళులు మాత్రమే క్షవరం చేయడం లేదు.. హైదరాబాద్ లో మీకు క్షవరం చేసే వాళ్లు మంగళి కులస్తులు అని చెప్పారా? గొర్రెలు మేపడాన్ని వ్యాపారంగా మలుచుకుని.. గ్రామాల్లో అన్ని కులాల కుటుంబాలూ బతకట్లేదా?

ఎంతమంది యాదవుల ఇళ్లలో పాలూ పెరుగు ఉంటుంది? యాదవులు అంటే.. కేవలం పశువులు మేపడానికి స్టిక్ ఆన్ అయ్యున్నారా? ఏ మాత్రం ఇంగితం ఉన్న వారికి అయినా.. ఈ విషయాలన్నింటి మీదా క్లారిటీ ఉంటుంది. కంచె ఐలయ్య వంటి మేధావులకు తప్ప, ఈ పెద్దమనిషికి తోడు, వేషధారణ మార్చిన గద్దర్ ఒకడు. ఇన్నేళ్లూ పాటలు పాడి.. పిల్లలను నక్సలిజం వైపు పంపాడు, ఇప్పుడేమో ఈయన వేషం మార్చి.. రాజకీయం చేస్తున్నాడు.

కోమటోళ్లు వ్యాపారం చేస్తున్నారట, లాభం తీసుకుంటున్నారట.. ఏ యుగంలో ఉన్న వారండీ ఈ మాటలు మాట్లాడాల్సింది? ఈ యుగంలోని మనిషేనా ఈ కంచె ఐలయ్య? ఒకవైపు విదేశీ పెట్టుబడులు, విదేశీ రీటైల్ మర్చంట్లు.. ఇండియాలోని చిన్న చిన్న పట్టణాల్లోకి కూడా ప్రవేశించిన వేళ.. ఇప్పుడు కోమట్ల మీద పడి ఏడవడమా? వాళ్లను స్మగర్లు అనడం..అది తిట్టు కాదు అని చెప్పడమా? కంచె ఐలయ్యది చాలా చీప్ ట్రిక్.

తను రాసిన పుస్తకాన్ని అమ్ముకోవడానికి ఈ చిల్లర పని చేస్తున్నట్టుగా ఉన్నారు. దీనికి తోడు భావస్వేచ్ఛ అనే పదం.. నిజమే రాజ్యాంగం భావస్వేచ్ఛ ఇచ్చింది. ఇలా ఒక కులం మీద దుమ్మెత్తిపోయడానికి కాదు. తన దిష్టిబొమ్మను దహనం చేస్తేనే కంచె ఐలయ్యకు, ఆయన సన్నిహితుడు గద్దర్ కు అంత కోపం వస్తోందే.. మరి వాళ్లను అకారణంగా నిందిస్తే.. వాళ్లకెంత కోపం రావాలి? ఈ కామన్ సెన్స్ కంచె కు లేదా?