Advertisement

Advertisement


Home > Politics - Gossip

ప‌వ‌న్ క‌ల్యాణ్.. మ‌న‌స్త‌త్వానికి ఇది మ‌రో నిద‌ర్శ‌న‌మా!

ప‌వ‌న్ క‌ల్యాణ్.. మ‌న‌స్త‌త్వానికి ఇది మ‌రో నిద‌ర్శ‌న‌మా!

ఇంత‌కీ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో ప‌వ‌న్ క‌ల్యాణ్ గొడ‌వేమిటి? ప‌వ‌న్ క‌ల్యాణ్ కు జ‌గ‌న్ అంటే ఎందుకంత అక్క‌సు? ప‌్ర‌త్య‌ర్థి విష‌యంలో కూడా ఆచితూచి స్పందించాల్సిన రాజ‌కీయంలో జ‌గ‌న్ విష‌యంలో ప‌లు సార్లు ప‌వ‌న్ క‌ల్యాణ్ అనుచితంగా మాట్లాడాడు. అలా మాట్లాడి న‌వ్వుల పాలైంది కూడా మ‌రెవ‌రో కాదు ప‌వ‌న్ క‌ల్యాణే.

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాసి పెట్టుకోవాల‌ని, ఆయ‌న ఎప్ప‌టికీ సీఎం కాలేడ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన భీష‌ణ వ్యాఖ్య న‌వ్వుల పాలైంది. జ‌గ‌న్ ను సీఎం కానివ్వ‌నంటూ ప్ర‌గ‌ల్బాలు ప‌లికిన ప‌వ‌న్ క‌ల్యాణ్ అదే జ‌గ‌న్ పార్టీ లోని చిన్న స్థాయి నేత‌ల చేతిలో ఒక‌టికి రెండు చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయారు. 

ఒక్క మాట‌లో చెప్పాలంటే విప‌రీత స్థాయిలో అహంకారాన్ని ప్ర‌ద‌ర్శించి, త‌న‌నో రాజ‌కీయ శ‌క్తిగా ఊహించుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. జ‌స్ట్ కామెడీ పీస్ అయ్యాడు. సినిమాల్లో క‌మేడియ‌న్లు హాస్య సీన్ల‌లో న‌టిస్తూ ఉంటారు, ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల్లో విదూష‌కుడు అయ్యాడు ఆ ఒక్క మాట‌తో!

ఇప్ప‌టికే రాజ‌కీయంగా జ‌గ‌న్ చేతిలో చావుదెబ్బ తిన్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఇప్పుడు మ‌రింత అహందెబ్బ తిని ఉన్నాడు. త‌న రాజ‌కీయ శ‌క్తి గురించి అతిగా ఊహించుకుని నిలువెత్తు అహంకారంతో మాట్లాడే ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఆ త‌ర్వాత రాజ‌కీయంగా త‌లెత్తుకోద‌గిన విజ‌యాలు కూడా ఏవీ సాధించ‌నూ లేదు! బీజేపీకి జోడు వాయిద్యంలా మారింది ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రిస్థితి.

ఆ సంగ‌త‌లా ఉంటే.. వైఎస్ జ‌గ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ లోని అక్క‌సు, జ‌ల‌సీ మ‌రోసారి బ‌య‌ట‌ప‌డిన‌ట్టుగా ఉంది. జ‌గ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ ద‌గ్గ‌ర నుంచి ప‌క్క రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ఏపీ రాజ‌కీయ ప్ర‌ముఖులు, సినిమా హీరోలు, ద‌ర్శ‌కులు కూడా స్పందించారు. 

జ‌గ‌న్ విధానాల‌ను అనునిత్యం ద్వేషిస్తూ మాట్లాడే చంద్ర‌బాబు నాయుడు కూడా స్పందించారు. జ‌గ‌న్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌ల‌ను సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు.

పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ‌డం అంటే.. జ‌స్ట్ అదో హుందాత‌నం. ఉద‌యం లేస్తే ఫేస్ బుక్ లో స్నేహితుల సంబంధించిన నోటిఫికేష‌న్లు వ‌స్తూ ఉంటాయి. ఎవ‌రి పుట్టిన రోజు ఎప్పుడో గుర్తుంచుకోవాల్సిన అవ‌స‌రం లేదు. వ‌చ్చిన నోటిఫికేష‌న్ల‌కు అనుగుణంగా ఒక పోస్టు పెట్ట‌డ‌మో, మెసేజ్ చేయ‌డమో జంటిల్మెన్ ల‌క్ష‌ణం.

ఫేస్ బుక్ లో ముఖ ప‌రిచ‌యం లేని ఫ్రెండ్స్ కూడా ఎంతో మంది ఉంటారు.  అలాంటి వారి పుట్టిన రోజు సంద‌ర్భంగా కూడా నోటిఫికేష‌న్ల‌ను అనుస‌రించి శుభాకాంక్ష‌ల‌ను తెల‌ప‌డం నిస్సందేహంగా ఒక మంచి ల‌క్ష‌ణ‌మే. సామాన్యుల్లోనే చాలా మందిలో ఈ మాత్రం మంచి ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డుతూ ఉంటాయి. 

అయితే ఈ మాత్రం స్థాయి కూడా త‌న‌కు లేద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చాటుకున్నాడు.  ఇదంతా గ‌మ‌నిస్తే ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌క్షంతా జ‌గ‌న్ మీదే ఉన్న‌ట్టుంది. జ‌గ‌న్ విష‌యంలో అక్క‌సుతో కూడిన మాట‌ల‌ను బ‌హిరంగంగా మాట్లాడ‌టానికి ప‌వ‌న్ వెనుకాడ‌లేదు. అలాగే ఇలాంటి సంద‌ర్భాల్లో జ‌గ‌న్ మీద ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌సు ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతూ ఉంటుంది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ శుభాకాంక్ష‌ల‌ను చెప్పినా, చెప్ప‌క‌పోయినా జ‌గ‌న్ కు వ‌చ్చిదీ, పోయేదీ ఏమీ లేదు. అలాగే ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌చ్చితంగా శుభాకాంక్ష‌లు చెప్పాల్సిందే అనేదీ ఏమీ లేదు! చెప్పినంత మాత్రానా జ‌గ‌న్ మీద ప‌వ‌న్ కు గౌర‌వ‌మో, అభిమాన‌మో ఉన్న‌ట్టు కూడా కాదు. అయితే చెప్ప‌క‌పోవ‌డం ద్వారా ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న అక్క‌సు, అసూయ‌ల‌ను బాహాటంగా చాటుకుంటూ ఉంటాడంతే!

బీజేపీ చిల‌కొట్టుడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?