cloudfront

Advertisement


Home > Politics - Gossip

జగన్ 'డ్రామా' ఎప్పుడు నేర్చుకుంటాడో?

జగన్ 'డ్రామా' ఎప్పుడు నేర్చుకుంటాడో?

వ్యక్తిగతంగా చూసుకుంటే మంచిదే. నికార్సుగా, నిర్మొహమాటంగా వుండడం మంచిదే కావచ్చు. మంచి లక్షణాలే కావచ్చు. కానీ పబ్లిక్ లైఫ్ లో అందునా రాజకీయాల్లో కాస్తయినా డ్రామా, లౌక్యం లాంటివి వుండాలి. అందునా ప్రత్యర్థి దగ్గర పది రూపాయలు ఇలాంటి లక్షణాలు వున్నపుడు, ఇవతలి వాళ్లు కనీసం పది పైసలైనా అలవర్చుకోవాలి. 

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే, జగన్ మాట తీరు బట్టే. జగన్ తండ్రి వైఎస్ చేసిన పాదయాత్ర పై 15 కోట్లకు పైగా ఖర్చు చేసి సినిమా తీసారు. అది వారి ఆనందం కావచ్చు. సినిమా చూస్తే వైకాపాకు పూర్తిగా పనికి వచ్చేలా తయారయింది. పక్కాగా ప్రచారానికి పనికి వస్తుంది.

నిజానికి తన తండ్రి మీద తన పార్టీకి పనికి వచ్చేలా తీసిన సినిమా కాబట్టి, జగన్ మొదటి రోజే సినిమా చూడడానికి ఏర్పాట్లు చేయమని యూనిట్ ను అడగాలి. కానీ అడగలేదు. పోనీ నిర్మాత, దర్శకులు వెళ్లి అడిగన తరువాత అయినా, సరే చూస్తాను, అని వెళ్లాలి. 

ప్రస్తుతం వేరే పనుల్లో, ప్రీ కమిట్ మెంట్లతో బిజీగా వున్నాను, వీలుచూసుకుని చూస్తాను అనేసారు. దాంతో సోషల్ మీడియాలో వీలయిన చోటల్లా, తండ్రి మీద తీసిన సినిమా చూడ్డానికి కూడా జగన్ కు టైమ్ లేదు, ఆసక్తి లేదు అనేలా కామెంట్లు. అదేకనుక పదండి చూస్తాను అని చూసేసి వుంటే లేదా, క్యూబ్ ద్వారా ఇంట్లోనే చూసి వుంటే, లేదా ఈ రాత్రికి చూస్తాను అంటే. ఇలా ఏదయినా చెప్పొచ్చు. అప్పుడు ఈ కామెంట్లకు అవకాశం వుండదు.

అదే విధంగా జగన్ కనుక విజయవాడలోనో, విశాఖలోనో థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తే వచ్చే బజ్ నే వేరు. అది సినిమాకు కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ చేయడం అన్నది మనిషికి వ్యక్తిగతంగా ఇన్ బిల్డ్ కాస్త డ్రామా చేయడం అలవాటు వుంటే వస్తుంది. కానీ జగన్ కు అది ఏ కోశానా లేదు. అదే సమస్య.