cloudfront

Advertisement


Home > Politics - Gossip

జగన్ లో ఏమిటీ అనూహ్య మార్పు..?

జగన్ లో ఏమిటీ అనూహ్య మార్పు..?

వైఎస్ఆర్సీ పార్టీ అధినేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగిన గంటల వ్యవధిలోనే స్పందించిన చంద్రబాబు ప్రతిపక్షనేతపై తనకున్న అక్కసు వెళ్లగక్కారు. రాజకీయ దివాళాకోరు వ్యాఖ్యలతో పరువుపోగొట్టుకున్నారు. కానీ దాడి జరిగిన వారంరోజుల తర్వాత జగన్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ వారం రోజుల్లో జరిగిన పరిణామాలను విశ్లేషించి మరీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

వాస్తవానికి జగన్ కు కూడా కాస్త దూకుడెక్కువ. కానీ ఈ నాలుగున్నరేళ్ల సమయంలో ఆయనలో ఎక్కడలేని పరిణతి కనిపిస్తోంది. ప్రతి ఘటనను లోతుగా విశ్లేషించి మరీ నిర్ణయం తీసుకునే నేర్పు వచ్చింది. అందుకే కోర్టు తలుపు తట్టడానికి ఆయన వారం వెయిట్ చేశారు. తనపై దాడి జరిగిన వెంటనే ఇది అధికార పక్షం కుట్ర అనడం ఎంతో తేలిక. కానీ జగన్ ఎక్కడా నోరు జారలేదు.

దాడి జరిగిన తొలిరోజు దిగులుపడొద్దంటూ అభిమానులకు ట్విట్టర్ సందేశమిచ్చారు., తర్వాత తన దగ్గర స్టేట్ మెంట్ తీసుకోడానికి వచ్చిన పోలీసులతో మీపై నాకు నమ్మకం లేదని తిప్పి పంపించేశారు. చివరకు అక్టోబర్ 31 బుధవారం రోజున దాడి కేసు విచారణను నిష్పాక్షికంగా, పారదర్శకంగా దర్యాప్తు చేయాలని, స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని హైకోర్టుని కోరారు.

ఈ వారం రోజుల్లో జరిగిన పరిణామాలను తన పిటిషన్ లో వివరించారు జగన్. దాడి జరిగిన వెంటనే చంద్రబాబు, డీజీపీ సహా ఇతరులు చేసిన వ్యాఖ్యలను, ఆపరేషన్ గరుడ పేరుతో వచ్చిన వార్తలను ఇందులో ప్రస్తావించారు. దాడిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరిగిందని, తాను అప్రమత్తంగా లేకపోతే కత్తి గొంతులో దిగేదని పిటిషన్లో పేర్కొన్నారు జగన్.

స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేపట్టాలని కోర్టు ఆదేశిస్తుందా లేదా అన్నది తర్వాతి విషయం. ముందు జగన్ తాను చెప్పదలచుకున్న విషయాన్ని కోర్టు వేదికగా ప్రజల ముందుంచారు. ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారో తెలియక ముందే వారంరోజుల్లో టీడీపీ ఎన్ని డ్రామాలాడిందీ, ఎలాంటి నీచ రాజకీయాలు చేసిందీ జగన్ వివరించే ప్రయత్నం చేశారు.

పిటిషన్ పై విచారణ జరపనున్న కోర్టు, స్వతంత్ర సంస్థ దర్యాప్తు చేయాలని ఆదేశిస్తే జగన్ తొలి విజయం సాధించినట్టే. అది కచ్చితంగా టీడీపీ ప్రభుత్వానికి చెంపదెబ్బలా తగులుతుంది. విచారణ జరక్కముందే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, డీజీపీ హడావుడిగా చేసిన వ్యాఖ్యలు సామాన్య ప్రజల్లో కూడా తీవ్ర చర్చకు దారితీశాయి.

చివరకు నిందితుడు శ్రీనివాసరావు తనకు ప్రాణహాని ఉందని మీడియా ముందు హడావుడి చేయడం, పిచ్చిపిచ్చిగా మాట్లాడ్డం కూడా ఓ పథకం ప్రకారం జరిగినవేనని చెప్పాలి. అతడి కాల్ డేటా విశ్లేషిస్తే విస్తుపోయే వాస్తవాలు తెలుస్తున్నాయని సమాచారమందుతోంది.

ఇలాంటి టైమ్ లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న పోలీసు వ్యవస్థతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏమేరకు ఈ వాస్తవాలను బైటకు తెస్తుంది. అధికార పార్టీతో అంటకాగే డీజీపీ వాస్తవాల్ని తొక్కిపెట్టరని గ్యారెంటీ ఏంటి? అనే సందేహాలు వస్తున్నాయి.

అందుకే జగన్ బైటకొచ్చారు. పారదర్శక విచారణ చేయాల్సిందేనని పట్టుబట్టారు. రాజకీయ దాడులను ఎన్నిటినో తట్టుకొని రాటుదేలిన జగన్ ను ఈ భౌతిక దాడి మరింత అప్రమత్తం చేసింది. ఆయనలో మరింత పరిణతి పెంచింది. 

గాడి తప్పిన మోడీ పాలన.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్