Advertisement

Advertisement


Home > Politics - Gossip

జగన్ కు ఆ కిక్కే వేరప్పా

జగన్ కు ఆ కిక్కే వేరప్పా

మన వాళ్లు మనను ప్రశంసిస్తే అది ఒక విధంగా వుంటుంది. ప్రత్యర్థులు మెచ్చుకుంటే మరో విధంగా వుంటుంది. జగన్ విషయంలో జన్మవైరం వున్నట్లు తన మీడియాను నడిపే ఆర్కే ఈవారం తన కొత్త పలుకులో ప్రవచించిన మాటల ఇవి. 

''..కేసీఆర్‌ భయపడుతున్నట్టుగా జగన్ భయపడటం లేదు. తన కేసుల విషయంలో ఏం జరిగినా ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా ఉండడమే ఇందుకు కారణం. అదే సమయంలో కేంద్ర పెద్దలతో ఢీకొనే సాహసాన్ని కూడా జగన్‌రెడ్డి చేయడం లేదు. 

కేంద్రంతో లౌక్యంగా వ్యవహరిస్తూ తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ అవసరాలు ఉన్నందున కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా కొన్ని సందర్భాలలో ఆయనకు సహకారం అందిస్తున్నారు....''

జగన్ కేంద్రానికి భయపడడం లేదు. ఆయన తన కేసుల పర్యవసానాన్ని ఎదుర్కొవడానికి సిద్దంగా వున్నారు. అయితే అలా అని కేంద్రాన్ని ఢీకొనడం లేదు. పైగా లౌక్యంగా ప్రవర్తిస్తూ పనులు చక్కబెట్టుకుంటున్నారు. 

కేంద్రం కూడా సహకరిస్తోంది. ఇదే కదా ఆర్కే చెప్పింది. ఇంతకన్నా గొప్ప ప్రశంస ఏం ఆశించాలి ఆర్కే లాంటి కరుడుకట్టిన 'దేశం' మద్దతుదారు నుంచి. పైగా కేసిఆర్ కన్నా గొప్పోడే జగన్ అంటున్నారు. 

నిజానికి ఈ విషయం ఆర్కే కొత్తగా కనిపెట్టారు అనుకోవాలేమో? ప్రపంచంలోనే శక్తి వంతమైన మహిళ అని పేరు పడిన సోనియానే ఢీకొన్నాడు జగన్. జైలుకుపోయి నెలల కొద్దీ కాలం గడిపాడు. 

జనాల్లో ఏడాదికి పైగా మొండిగా తిరిగాడు. ఈ సంగతులు అన్నీ జనాలకు తెలుసు. అర్థం చేసుకున్నారు నాయకత్వ లక్షణాల గమనించారు కనుకే గెలిపించారు.

కానీ ఆర్కేకే తెలియడానికి ఇన్నాళ్లు పట్టిందేమో? అయితే పగవారు పొగిడితే వచ్చే కిక్కే వేరప్పా.

కృష్ణ..కృష్ణ..అమరావతిపై సరైన ప్రశ్న

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?