cloudfront

Advertisement


Home > Politics - Gossip

జగన్ కు మరో 'అక్రమ సంబంధం'

జగన్ కు మరో 'అక్రమ సంబంధం'

తాము తింటే ఫలహారం.. అవతలి వాడు తింటే దొంగతిండి అని ప్రచారం చేయడంలో తెలుగుదేశం, దాని అను'కుల'మీడియాను మించింది లేదు. గత ఎన్నికలపుడు కాంగ్రెస్ లో జతకట్టి, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని జనాల ముందు వైకాపాను దోషిగా చూపించాయి. అప్పుడు కాంగ్రెస్ అంటే జనాలకు కోపంగా వుంది కనుక. అదే కాంగ్రెస్ తో నిస్సిగ్గుగా, నిర్లజ్జగా తెలుగుదేశం సంబంధం పెట్టుకున్నా, మంచిదే అంటూ బాజాలు వాయించకున్నారు.

ఇప్పుడు లేటెస్ట్ గా జనాలకు భాజపా అంటే కోపం కనుక, దాంతో జగన్ కు అక్రమ సంబంధం అంటగట్టి ప్రచారం చేస్తున్నారు. అది చాలదన్నట్లు జనసేనతో కూడా మరోపక్క సంబంధం అంటగట్టి ప్రచారం సాగిస్తున్నారు. ఈరెండూ చాలవన్నట్లు ఇప్పుడు ఇంకోటి దొరికింది. అదే కేసిఆర్ ఇస్తానన్న రిటర్న్ గిప్ట్.

కేసిఆర్ ఆంధ్ర వచ్చి, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే, అది జగన్ కోసమే అన్నట్లుగా చూపిస్తూ, కేసిఆర్ తో ఇప్పుడు జగన్ కు అక్రమ సంబంధం అంటగట్టే ప్రచారానికి మెల్లగా తెరతీస్తోంది బాబుగారి అను'కుల'మీడియా.

కేసిఆర్ ఏదో అలవోకగా అన్న రిటర్న్ గిఫ్ట్ మాట పట్టుకుని, ఇప్పటి నుంచే దానిచుట్టూ రకరకాల విశ్లేషణలు తయారుచేసి అందిస్తోంది. భవిష్యత్ లో నిజంగా కేసిఆర్ వస్తే, ఆ వేళకే జగన్ కు, ఆయనకు లింకు తయారుచేసేసి రెడీగా వుంచాలన్న ఉద్దేశం ఈ వార్తల్లో క్లియర్ గా కనిపిస్తోంది.

తెలంగాణ ఆత్మగౌరవం అంటూ కేసిఆర్ తెలివిగా చంద్రబాబును కార్నర్ చేసినట్లే, ఇప్పుడు కేసిఆర్ ను కార్నర్ చేస్తూ, ఆయనతో పాటు జగన్ కు లింక్ కట్టేసి, పనిలో పనిగా వైకాపాను ఈసారి ఎన్నికల్లో ఈ ఎత్తుగడతో చిత్తుచేయాలని మెలమెల్లగా ప్రయత్నాలు ప్రారంభించేసారు.

కానీ ఇక్కడ అసలు లాజిక్ మరిచిపోతున్నారు. తెలుగు రాష్ట్రాలను చీల్చింది కాంగ్రెస్ ఫార్టీ. అలాంటి పార్టీతో చంద్రబాబు అంటకాగితే లేనిది, కెసిఆర్ వచ్చి ప్రచారం చేస్తే తప్పు అంటే ఎలా?

కేసీఆర్, బాబు పాలనపై సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే?

వెల్లువెత్తిన అభిమానం మినిష్టర్ క్వార్ట్రర్స్ జామ్ ఎక్కడంటే