రాజకీయాల్లో ఎందరు మగాళ్లున్నా ఇందిరా గాంధీకి సాటి రారు అనేది 70 నుంచి 80 వ దశకంలో గట్టిగా వినిపించేది.
అందుకే దేశంలోని ప్రతిపక్షాలు, వాటి నాయకులు ఒక్కటైతే తప్ప ఇందిరాగాంధీని గద్దె దించలేకపోయారు. కానీ అలా దించిన కొన్ని నెలలకే జనతా ప్రభుత్వం, ఆ ప్రయత్నం రెండూ కూలిపోయాయి. ఇన్నాళ్ల తరువాత అలాంటి ప్రయత్నం చేయాలంటున్నారు పవన్ కళ్యాణ్.
ఆంధ్రలో జగన్ ను గద్దె దించడానికి సమస్త ప్రతిపక్షాలు ఏకం కావాల్సిందే అన్నది ఆయన పిలుపు. అంటే..
జగన్ ను గద్దెదించడానికి నలభై ఏళ్ల అనుభవం వున్న చంద్రబాబు, మోడీ నే ఢీకొని జాతీయస్థాయిలో పోరు సల్పిన నాయకుడు. ఆయనా, ఆయన పార్టీ సరిపోదు.
జగన్ ను గద్దె దించడానికి పవర్ స్టార్ ట్యాగ్ లైన్ వున్న పవన్ అస్సలు సరిపోరు. ఆయన మీటింగ్ లకు వచ్చే జనం సరిపోరు.
ఆయన పొత్తు పెట్టుకున్న భాజపా కు అంత సీన్ లేదు.
కాంగ్రెస్ సంగతి సరేసరి, తోకపార్టీలను ముద్రపడిపోయిన వాటి సంగతి చెప్పనక్కరలేదు.
వీళ్లందరు కలిస్తే తప్ప జగన్ ను కిందకు లాగలేరు. అదీ పవన్ కనిపెట్టిన విషయం. అందుకే మొత్తం అందరూ కలిసి రండి..జగన్ ను ఓడిద్దాం అంటున్నారు.
మొత్తానికి జగన్ వీరుడు. కొట్టాలంటే ఒక్కరి వల్ల కాదు అని అంగీరించారు పవన్.