cloudfront

Advertisement


Home > Politics - Gossip

అచ్చెన్నాయుడు అసెంబ్లీలో అడుగుపెట్టకూడదు

అచ్చెన్నాయుడు అసెంబ్లీలో అడుగుపెట్టకూడదు

శ్రీకాకుళంజిల్లా నుంచి ఎన్నికై, మంత్రిస్థాయికి ఎదిగిన టీడీపీనేత అచ్చెన్నాయుడుపై వైసీపీ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈసారి అచ్చెన్నాయుడ్ని ఎలాగైనా ఓడించాలని ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే టెక్కలి నియోజకవర్గం అభ్యర్థి ఎంపికపై కీలకంగా దృష్టిపెట్టారు జగన్. ఇంతకీ వైసీపీకి అచ్చెన్నాయుడిపై ఎందుకంత గురి?

గడిచిన ఐదేళ్లలో వైసీపీపై, అధినేత జగన్ పై ఎక్కువగా విమర్శలు చేసిన టీడీపీ నేతల్లో అచ్చెన్నాయుడు ఒకరు. అటు అసెంబ్లీలో, ఇటు అసెంబ్లీ బయట పార్టీపై ఆయన చేసిన విమర్శలు అన్నీ ఇన్నీకావు. ఒకదశలో ఆయన వ్యక్తిగత దూషణకు కూడా దిగారు. అదేపనిగా జగన్ పై నోరేసుకొని అరిచేవారు. అందుకే ఆయన్ని మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టనీయకుండా చేయాలని జగన్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.

ఇందులో భాగంగా కిల్లి కృపారాణిని రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నారు జగన్. సామాజికంగా, రాజకీయంగా ఎలా చూసుకున్నా అచ్చెన్నాయుడిపై కృపారాణిని బరిలోకి దించడం సరైన నిర్ణయం. ఎందుకంటే టెక్కలి నియోజకవర్గంలో వెలమ, కాళింగ సామాజిక వర్గాలు ఎక్కువ. గత ఎన్నికల్లో కాళింగ వర్గపోరు కారణంగా అచ్చెన్నాయుడు గెలిచారనేది నియోజకవర్గంలో ఎవర్ని అడిగినా చెబుతారు. సరిగ్గా దీనిపైనే జగన్ దృష్టిపెట్టారు.

కిల్లి కృపారాణి సాయంతో ఆ సామాజిక వర్గాన్ని ఒక తాటిపైకి తీసుకొస్తే కృపారాణి గెలుపు నల్లేరు మీద నడకే. పైగా జనాభా పరంగా చూసుకున్నా వెలమ కంటే కాళింగులు అక్కడ అధికం. నియోజకవర్గంలో 2-3 మండలాల్లో అచ్చెన్నాయుడికి ఆధిపత్యం ఉన్నప్పటికీ, ఓవరాల్ గా కాళింగ వర్గం కలిస్తే కృపారాణికి ప్లస్ అవుతుంది.

ఆఖరి నిమిషంలో పార్టీలో చేరినప్పటికీ కృపారాణి వైపే జగన్ మొగ్గుచూపడానికి ప్రధాన కారణాలు ఇవే. దీనికితోడు పాదయాత్ర సందర్భంగా అచ్చెన్నాయుడుపై వ్యతిరేకత ఉందనే విషయాన్ని కూడా జగన్ గ్రహించారు. ఈ సమీకరణాలన్నింటినీ క్రోడీకరించి త్వరలోనే ఈ నియోజకవర్గంపై ఓ నిర్ణయం తీసుకుంటారు జగన్.

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

అనంత వైసీపీలో అప్పుడే మంత్రి పదవుల లొల్లి!