cloudfront

Advertisement


Home > Politics - Gossip

జనసేన భారీ నిధుల సమీకరణ?

జనసేన భారీ నిధుల సమీకరణ?

జనసేన డబ్బులు అవసరం లేని కొత్తతరహా రాజకీయాలు చేస్తుందని పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్నారు. అయితే వాస్తవం వేరుగా వుందని టాలీవుడ్ లో, అటు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీ అభిమానులు, ఆశ్రితులు భారీగా విరాళాలు అందిస్తున్నారని, ఇప్పటికి వచ్చిన విరాళాలు అరవై కోట్లకు పైగానే వుంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

గతంలో పవన్ దగ్గర శరత్ మరార్ అన్నీతానై వుండేవారు. అటు తెలుగుదేశం వర్గాలకు, ఇటు పవన్ కు మధ్య ఆయనే అన్నీ తన భుజాలమీద వేసుకుని వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు పవన్ కు ఆయన దూరమయ్యారు. ప్రస్తుతం అల్లు అరవింద్ గీతాసంస్థకు చెందిన బన్నీ వాస్ ఆ ప్లేస్ ను భర్తీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పవన్ తరపున ప్రస్తుతం అన్నీ ఆయనే వ్యవహారాలు చేస్తున్నారని వినిపిస్తోంది. విరాళాలు, జమాఖర్చులు, పవన్ కార్యక్రమాల ప్లానింగ్, అలాగే సమావేశాలకు ఏర్పాట్లు అన్నీ బన్నీవాస్ నే చేస్తునట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ కు అత్యంత నమ్మకస్తుడైన బన్నీ వాస్ ఇప్పుడు పవన్ కు కూడా అత్యంత హితుడుగా, నమ్మకస్తుడిగా మారినట్లు తెలుస్తోంది.

గోదావరి జిల్లాలకు చెందిన అభిమానులు, వ్యాపారవేత్తలు, ఇంక ఎన్నారైలు వగైరాల నుంచి చిన్న చిన్న మొత్తాల్లో అయినా భారీగానే విరాళాలు పోగయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీటన్నింటి నిర్వహణ కూడా బన్నీవాస్ నే చూస్తున్నట్లు తెలుస్తోంది. బన్నీవాస్ ప్రస్తుతం పూర్తిగా జనసేన కార్యాలయానికే అంకింతమైపోయి వున్నారు.

అప్నా టైం ఆయేగా సాబ్ 

చెట్టు పేరుతో ఓట్లు అడుక్కోవడం.. ఎన్నాళ్లిలా