Advertisement

Advertisement


Home > Politics - Gossip

అన్ని పాములూ ఆడితే.. వానపాము కూడా..

అన్ని పాములూ ఆడితే.. వానపాము కూడా..

నాదస్వరం ఊదినప్పుడు అన్ని పాములూ లేచి ఆడుతోంటే.. వానపాము కూడా లేచి ఆడిందని సామెత! ఇప్పుడు స్థానిక ఎన్నికల పర్వం రాగానే... ప్రస్తుతం నామినేషన్ల తంతు నడుస్తుండగా... ప్రత్యర్థులను భయపెడుతున్నారని, నామినేషన్లు వేయనివ్వడం లేదని..  తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపిస్తోన్న సమయంలో.. జనసేన కూడా అదే ప్రయత్నం చేస్తోంది. వాళ్లు ఆరోపణలు చేస్తున్నారు గనుక.. మనమూ చేయకపోతే బాగుండదు అన్నట్లుగా ఈ వ్యవహారం ఉన్నదే తప్ప.. జనసేన తరఫు అభ్యర్థులు ఎక్కడ ఉన్నారో.. వారికి ఎక్కడ కష్టాలు వచ్చాయో క్లారిటీ ఉండట్లేదు.

నామినేషన్ల పర్వం మొదలు కాక ముందునుంచి.. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ మీద రకరకాల అనుమానాలు పుట్టిస్తూ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. బురద చల్లుతున్నారు. తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, నామినేషన్లు వేయకుండా అడ్డు పడుతున్నారని అంటున్నారు. నిజానికి ఆ పార్టీకి కూడా ప్రతిచోటా కేండిడేట్లను వెతికిపట్టుకోవడం కష్టంగానే ఉన్నది. ఆ లోపం ప్రజలకు తెలియకుండా, నెపం వైకాపా పైకి నెట్టేస్తున్నారు.

నామినేషన్లు మొదలయ్యాక.. ఈ ఆరోపణలు ఇంకా ఎక్కువయ్యాయి. ఊర్లు, ఉదాహరణలతో సహా.. ఎక్కడెక్కడ నామినేషన్లు అడ్డుకుంటున్నారో.. రచ్చ జరిగిన ప్రతి ఊరినీ కోట్ చేస్తూ చంద్రబాబు చెబుతున్నారు. ఆయన ఆరోపించడంలో అర్థముంది. ఆ పార్టీకి రాష్ట్రంలో ఇంకా కొంత బలం మిగిలే ఉంది. ఆ పార్టీకోసం నామినేషన్లు వేసేవారున్నారు. కొన్నిచోట్ల దొమ్మీలు జరగుతున్నాయి కూడా.

వారితో పోల్చుకుని.. నామినేషన్లు వేయవద్దంటూ తమ పార్టీని కూడా బెదిరిస్తన్నారంటూ జనసేన చెప్పడమే కామెడీగా కనిపిస్తోంది. ఒకవేళ వైకాపా నాయకులు బెదిరించాలని అనుకున్నా కూడా.. ఊర్లలో జనసేన పార్టీ వారెవ్వరో, ఎవరిని బెదిరించాలో కూడా అర్థం కాని పరిస్థితి. అలాంటప్పుడు.. బెదిరించేస్తున్నారు బెదిరించేస్తున్నారు..అని నాదెండ్ల మనోహర్ గోలచేయడం చూస్తోంటే.. బెదిరింపుల మాట చెప్పి.. తమను తాము హీరోలుగా చాటుకోవడానికి ఎగబడుతున్నట్లుంది.

ఈ నలుగురూ ఏపీ వాణి వినిపించగలరా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?