Advertisement


Home > Politics - Gossip
జన‌సేన సేవాద‌ళ్ కార్య‌క‌ర్త‌ల‌కు ఉండాల్సిన అర్హ‌త‌లు ఇవే.

పార్టీ పెట్టి మూడేళ్ల‌వుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌న‌సేన పార్టీకి వ్య‌వ‌స్థాగ‌త కార్య‌ద‌ళం లేదు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆర్గ‌నైజ్డ్ కావాల‌నే ఉద్దేశంతో రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌న‌సేన సేవాద‌ళ్ పేరిట కార్య‌క‌ర్త‌ల నియామ‌కానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ శ్రీ‌కారం చుట్టాడు. నియామ‌క ప‌త్రంలో సేవాద‌ళ్ కార్య‌క‌ర్త‌ల‌కు ఉండాల్సిన అర్హ‌త‌లు అంటూ ప‌ది పాయింట్లు సూచించాడు. అందులో ప్ర‌ధాన‌మైన‌ది సామాజిక సేవ‌.

స‌హ‌చ‌ర కార్య‌క‌ర్త‌ల‌తో సోద‌ర భావంతో మెల‌గ‌డం. యువ‌త‌ను సేవాద‌ళ్ కార్య‌క‌ర్త‌లుగా చేర్చ‌గ‌ల స‌త్తా. ఎంత క‌ఠిన‌మైన ప‌ని అప్ప‌గించినా ఓర్పు, నేర్పుగా వ్య‌వ‌హ‌రించ‌డం. కులం, మ‌తం, వ‌ర్గం, ప్రాంతం అనే తేడాల‌ను ఎట్టిప‌రిస్థితుల్లోనూ ద‌రిదాపుల‌కు కూడా రానియ్య‌కూడ‌దు. వారంలో క‌నీసం మూడు గంట‌ల స‌మ‌యం పార్టీ కోసం కేటాయించ‌డం.. మ‌రి ప‌వ‌న్ జ‌న‌సేన‌లో చేరాల‌నుకునే యువకులు ఈ అర్హ‌త‌ల‌న్నీ త‌మ‌లో ఉన్నాయో లేదో ఒక సారి చెక్ చేసుకొని వెళ్లండి.