cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఆమెను చేర్చుకునే తాపత్రయంలో జనసేన!

ఆమెను చేర్చుకునే తాపత్రయంలో జనసేన!

బుట్టారేణుక... అటూ ఇటూ గెంతుతున్న రాజకీయ నేత. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గి.. ఫలితాలు రాగానే తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయే ప్రయత్నం చేశారు. అయితే ఎందుకో ఆగారు. అప్పుడు ఈమె భర్త తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు.

ఆ తర్వాత ఈమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ చంద్రబాబు విధానాలను తప్పుపడుతూ వచ్చారు. అయితే ఈమెను తెలుగుదేశ వదల్లేదు. లోకేష్ బాబు స్వయంగా రంగంలోకి దిగి రేణుకను తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకున్నారు. అలా తెలుగుదేశం నేత అయిపోయింది ఈ ఫిరాయింపు ఎంపీ.

ఇక తెలుగుదేశం పార్టీలోకి చేరినందుకు ఈమెకు ఎంపీ సీటు గ్యారెంటీ అని లోకేష్ బాబు ఆ మధ్య ప్రకటన చేశారు కూడా. కానీ చివరకు హ్యాండిచ్చారు. ఆమెకు ఎంపీ టికెట్ దక్కలేదు. కనీసం ఎమ్మెల్యే టికెట్ అడిగినా అది కూడా దక్కలేదు!

దీంతో రేణుక చాలా అసహనంతో ఉన్నారట. ఈమె తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో జనసేన రంగంలోకి దిగిందట! తమ పార్టీలోకి రమ్మని బుట్టా రేణుకకు జనసేన ఆఫర్ ఇస్తోందట.

జనసేన నంబర్ టు నాదెండ్ల మనోహర్ ఈ విషయంలో రేణుకతో చర్చలు జరిపారని, ఆమెను చేర్చుకునేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. ఎవరూ చేరకపోవడంతో ఆఖరికి బుట్టారేణుక వంటి లీడర్ ను చేర్చుకోవాలని జనసేన చూసినట్టుగా ఉంది.

కామెడీ ఏమిటంటే.. ఆమె  కూడా జనసేనలోకి చేరడానికి నో చెప్పారట. జనసేనలోకి చేరమనే కోరికను సున్నితంగా తిరస్కరించారట! తెలుగుదేశం పార్టీకి వాళ్లేమో ఎమ్మెల్సీ, రాజ్యసభ సీటుని హామీ ఇస్తున్నారట. అయితే చంద్రబాబు హామీలకు ఉండే పవర్ ఏమిటో బుట్టారేణుకకు బాగా అర్థమైంది. అందుకే ఆమె తెలుగుదేశం పార్టీని వీడటానికే నిర్ణయం తీసుకున్నారని టాక్!

ఓటు మాయం.. ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు 

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!