Advertisement


Home > Politics - Gossip
హవ్వా... వీళ్లా జనసేన ప్రతినిధులు..!

జనసేన ప్రతినిధులు వచ్చారు, టీవీల్లో మాట్లాడుతున్నారంటే.. ఇంకా ఏమో అనుకున్నాం! అయితే తీరా టీవీల్లో వీళ్లను చూస్తుండే సరికి, పాత సీసాలో పాత సారానే పోసినట్టుగా ఉంది కథ. మూడు నాలుగు రోజుల నుంచి టీవీల్లో జనసేన ప్రతినిధిగా ఒక వ్యక్తి చర్చల్లో పాల్గొంటూ ఉన్నాడు. అలాగే, ఈయన ప్రెస్ మీట్ పెట్టి జనసేనకు టీడీపీ నుంచి 40మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నరాంటూ.. సంచలన ప్రకటన చేశారు.

మరెవరైనా ఈ సంచలన ప్రకటన చేసి ఉంటే అదో లెక్క కానీ, ఈ ప్రకటన చేసింది.. మరెవరో కాదు, ఆయన పేరు అద్దేపల్లి శ్రీధర్. ఎవరీ ప్రజానేత అనుకుంటున్నారా? మొన్నటి వరకూ ఇదే మనిషి భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఉండేవాడు. టీవీ చర్చా కార్యక్రమాల్లో చాలా ఎక్కువగా కనిపించాడు. అప్పట్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఒక రేంజ్ లో వకల్తా పుచ్చుకుని మాట్లాడేవాడీయన.

అలాగే తెలుగుదేశం పార్టీపై కూడా రాళ్లు పడకుండా చూసుకునేవాడు. ఈయన వాదించే తీరు మరీ అడ్డగోలుగా ఉండేది కాదు కానీ, భారతీయ జనతా పార్టీ అత్యంత మంచిది, మోడీ చాలా మంచోడు, వెంకయ్యనాయుడు అంతకన్నా మంచోడన్నట్టుగా.. ఈయన మెత్తగా మాట్లాడేవాడు. ఇప్పుడు మార్పు ఏమిటంటే.. భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నాడు, తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నాడు, జనసేనను హైప్ చేస్తున్నాడు. పార్టీలు మారిన వారు లేరా? అనొచ్చు కానీ, జనసేన ఇప్పుడిప్పుడే జనాల్లోకి వెళ్తోంది.

ఇలాంటి సమయంలో.. నిన్నటి వరకూ వేరే పార్టీల తరఫున బల్లగుద్ది మాట్లాడిన వాళ్లు, ఇప్పుడు జనసేన తరఫున బల్లలు గుద్దుతుంటే.. ఇదంతా కామెడీ వ్యవహారం అయిపోతోంది. చూసే జనాలకైనా కాస్త రిఫ్రెష్‌మెంట్ ఇవ్వాల్సింది. అలాంటిదేమీ లేకుండా జస్ట్ గోడ మీద పిల్లులతో వ్యవహారం నడిపిస్తామనుకుంటే, ఆ పార్టీ పరిస్థితి అలాగే ఉండవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే.. ఇలా టీవీల్లో జనసేన తరఫున బల్లలు గుద్దుతున్న వాళ్లంతా ఒక సామాజికవర్గానికి చెందిన వాళ్లే! తనకు కులమే లేదని పవన్ కల్యాణ్ చెప్పుకోవడానికి.. చుట్టూ ఉన్న వాళ్లంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వాళ్లు కావడానికి భలే కుదిరిందే!