cloudfront

Advertisement


Home > Politics - Gossip

పవన్ కల్యాణ్ ట్వీట్ వెనక కేసీఆర్..?

పవన్ కల్యాణ్ ట్వీట్ వెనక కేసీఆర్..?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడంతో పవన్ కల్యాణ్ కి ప్రచారం చేసే తీరికా, వ్యూహాలు రచించే ఓపికా లేకుండా పోయాయి. అందుకే జనసేన ఎలక్షన్లకు దూరంగా ఉందని చెప్పుకుంటూ వస్తున్నారు పవన్ కల్యాణ్. సడన్ గా ఆయనకు జ్ఞానోదయం అయింది. తాను దూరంగా ఉన్నా, కనీసం తెలంగాణలో ఉన్న జనసేన శ్రేణులకైనా ఓ దిశానిర్దేశం చేయాలనుకున్నారో ఏమో, ట్విట్టర్ వేదికగా ఎన్నికలపై స్పందించారు.

జనసేన కార్యకర్తలు, మిత్రులు, ప్రజలు, తమ పార్టీ పేరు చెప్పుకుని ఎన్నికల బరిలో దిగిన అభ్యర్ధులు.. అందరూ మీ అభిప్రాయాలు తెలపండి, జనసేన పార్టీ అభిప్రాయాన్ని 5వ తేదీన తెలియజేస్తానంటూ ప్రకటించారు. సరిగ్గా పోలింగ్ కు 3 రోజుల ముందు పవన్ వేసిన ఈ ట్వీట్ ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తోంది.

ఆయన కేసీఆర్ కు మద్దతు పలికే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ఓట్లను ఆకర్షించేందుకే కేసీఆర్, ఇలా పవన్ ను తెరపైకి తీసుకొస్తున్నారనే ప్రచారం కూడా ఉపందుకుంది. ఓ హీరోగా తెలంగాణలో కూడా పవన్ కు ఫ్యాన్ బేస్ ఉంది.

మరీ ముఖ్యంగా యువతలో పవన్ కు ఫాలోయింగ్ ఉంది. అదే యువత టీఆర్ఎస్ పై గుర్రుగా కూడా ఉంది. కాబట్టి ఇలాంటి టైమ్ లో ట్రంప్ కార్డు టైపులో పవన్ ను వాడితే బాగుంటుందని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. పవన్ ట్వీట్ వెనక మతలబు ఇదేనని టాక్. పవన్-కేసీఆర్ మధ్య ఎలాంటి అభిప్రాయబేధాలు లేవు.

గత ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్ పై ఇష్టమొచ్చినట్టు పవన్ మాట్లాడినప్పటికీ, ఆ తర్వాత కేసీఆర్ పై ఎన్నోసార్లు ప్రశంసలు కురిపించారు జనసేనాని. ఆమధ్య ఏకంగా గంటపాటు ఆఫీస్ లో వెయిట్ చేసి మరీ కేసీఆర్ ను కలిసి, బయటకొచ్చి మీడియా సాక్షిగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. ఇన్ని సాక్ష్యాలు కళ్లముందు కదలాడుతుంటే.. టీఆర్ఎస్ కు మద్దతివ్వకుండా పవన్ ఎటుపోతారు?

ఏపీలో పవన్ కి ప్రధాన శత్రువు టీడీపీ, టీడీపీకి తెలంగాణలో బద్ధశత్రువు టీఆర్ఎస్. శత్రువుకి శత్రువు మిత్రుడు అయినట్టు పవన్ కేసీఆర్ కి స్నేహితుడు అవుతాడన్నమాట. దీనికితోడు తెలంగాణలో సెటిలర్ల ఓట్ల కోసం చివరి నిమిషంలో కేసీఆర్, పవన్ మద్దతు కోరారని కూడా ఉహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే పవన్ నేరుగా టీఆర్ఎస్ కోసం రంగంలోకి దిగకుండా పరోక్షంగా మద్దతిచ్చే అవకాశం ఉంది.

ఎలాగూ ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని కేటీఆర్ చెప్పారు కాబట్టి, ఏపీ ఎన్నికల సమయానికి పవన్ ని సపోర్ట్ చేసి బదులు తీర్చుకోవాలనే ఆలోచనలోనూ టీఆర్ఎస్ ఉంది. అందుకే కేసీఆర్ వ్యూహంలో భాగంగానే పవన్ తనకి అవసరం లేకపోయినా చివరి నిమిషంలో తెలంగాణ ఎన్నికలపై స్పందించారని అర్థమవుతోంది.

తెలంగాణ  ఎన్నికల్లో మద్దతుపై పవన్ ఏం చెప్పబోతున్నారో మరో 24 గంటల్లో తేలిపోతుంది.

మంత్రిగారికి ఓటమి తప్పదు.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్