cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఫేజ్-2 లోకి గులాబీ నేషనల్ ఫ్రంట్!

ఫేజ్-2 లోకి గులాబీ నేషనల్ ఫ్రంట్!

జాతీయ స్థాయిలో చిన్న పార్టీలను కూడగట్టి తాను స్థాపించదలచుకుంటున్న ఫ్రంట్ ను మూడోఫ్రంట్ అంటేనే కేసీఆర్ కు చిర్రెత్తుకు వచ్చేస్తుంది. తాను స్థాపించబోయేదే.. ఫస్ట్ ఫ్రంట్ అని.. మూడో ఫ్రంట్ అని ఎందుకు అనుకోవాలని కేసీఆర్ తొడకొట్టడం గమనిస్తేనే ఆయన ఆ ఫ్రంట్ గురించి ఎంత పట్టుదలగా ఉన్నారో అర్థం అవుతుంది. అందుకే దానిని ప్రస్తుతానికి తాత్కాలికంగా.. గులాబీ నేషనల్ ఫ్రంట్ అనిపిలిస్తే సబబుగా ఉంటుందేమో.

అలాంటి కేసీఆర్.. ఇప్పుడు తన ఫ్రంట్ ప్రయత్నాలను రెండో ఫేజ్ లోకి తీసుకు వెళుతున్నారు. ఇప్పటికే ఆయన ఫ్రంట్ ప్రకటించిన నాటినుంచి దేశవ్యాప్తంగా అనేక పార్టీలనుంచి ఆయనకు మద్దతు వెల్లువలా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ప్రత్యక్షంగా ఇతర పార్టీల నేతలతో భేటీలు మద్దతు మరియు భాగస్వామ్య సమీకరణకు రంగంలోకి దిగుతున్నారు.

తొలుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీతో కేసీఆర్ సోమవారం నాడు భేటీ కానున్నారు. ప్రధానంగా రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, భాజపాల ధోరణులకు వ్యతిరేకంగనకే కేసీఆర్ ఈ కూటమిని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆ రెండు పార్టీలో జాతీయ వాద దృక్పథం ముసుగులో రాష్ట్రాల హక్కులను హరించివేస్తున్నాయనేది ఆయన వాదన. ఆ వాదనకు-నిత్యం జాతీయ పార్టీలతో వైరంతోనే వ్యవహరించే మమత కూడా జత కలుస్తున్నారు. ఆమెతో రాష్ట్రాలకు ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉన్నదో.. ఫెడరల్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావడం శ్రేయస్కరమో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది.

అలాగే సోమవారం నాడు పార్లమెంటులో చర్చకు వచ్చే అవకాశం ఉన్న అవిశ్వాసం విషయంలో.. మమతా బెనర్జీ-తెదేపా తీర్మానానికి మద్దతు ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. ఇదే రోజున మమతా.. రెండో పార్శ్వంలో మోడీ వ్యతిరేక కూటమిని బలోపేతం చేయబోయే కీలక భేటీలో పాల్గొంటున్నారు. ఆ రకంగా గులాబీ బాస్ తలపెడుతున్న జాతీయ స్థాయి ఫ్రంట్ రెండో దశలోకి ప్రవేశిస్తున్నది.

మమత – కేసీఆర్ వాదనతో ఎంతమేరకు ఏకీభవిస్తారు అనే దానిని బట్టి.. జాతీయ స్థాయిలో ఇతర అనేక చిన్న పార్టీలను జట్టులోకి ఒప్పించడం అనేది కూడా సాధ్యమవుతుంది. మమతా బెనర్జీ మనస్ఫూర్తిగా పూనుకుంటే.. గనుక.. ఈ కూటమికి గణనీయమైన బలం చేకూరుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఇవాళ్టికి చంద్రబాబు పోకడ ఏమిటో స్పష్టం కాకపోతున్నప్పటికీ.. పరిణామాలు మరికొన్ని మలుపులు తిరిగేలోగా.. ఆయన కూడా ఈ కూటమిలోకి రాక తప్పదనే వాదన కూడా వినిపిస్తోంది.