cloudfront

Advertisement


Home > Politics - Gossip

ముందు ఎమ్మెల్యేను చేయండి సార్.. మళ్లీ సీఎం!

ముందు ఎమ్మెల్యేను చేయండి సార్.. మళ్లీ సీఎం!

లోకేష్ బాబుకు ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయని చెబుతున్నాడు విజయవాడ ఎంపీ కేశినేని నాని. లోకేష్ సీఎం.. అనే భజనకు కొన్నాళ్ల నుంచి తెలుగుదేశం నేతలు విరామం ఇచ్చారు. ఇప్పుడు దాన్ని కేశిసేని మళ్లీ మొదలుపెట్టినట్టుగా ఉన్నాడు.

నిజమే.. ఎవరైనా సీఎం కావొచ్చు. అందుకు రాజ్యాంగం ఏమీవద్దు అనదు. దారినపోయే దానయ్యను కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించినా రాజ్యాంగం వద్దనలేదు. ఆరునెలల వ్యవధిలో రాష్ట్రస్థాయి చట్టసభల్లో సభ్యుడు కావాలి, అసెంబ్లీలో అంతకన్నా మునుపే బలాన్ని నిరూపించుకోవాలి.. ఈ రెండే అర్హతలు కదా.

ప్రజలు ఓట్లు వేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలు ఓట్లు వేయకనే, వారు ఎమ్మెల్యేగా కూడా ఎన్నుకోకుండానే మంత్రి అయిన లోకేష్ బాబు ముఖ్యమంత్రి కావడం పెద్ద కథ ఏమీకాదు. చంద్రబాబు నాయుడు అనుకుంటే.. గంటసేపట్లో లోకేష్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవచ్చు.

ఇక మళ్లీ లోకేష్ కు వేరే అర్హతలు ఎందుకు? అయినా తెలుగుదేశం పార్టీవాళ్లు.. లోకేష్ ను ముఖ్యమంత్రి చేయడం గురించి ఆలోచించడం కన్నా మునుపు.. ఆయనను ఎమ్మెల్యేగా చేయడం గురించి ఆలోచిస్తే బాగుంటుందేమో.

లోకేష్ ముఖ్యమంత్రి అయ్యేది సరే కానీ.. లోకేష్ ఎక్కడ నుంచి ఎమ్మెల్యే అవుతున్నాడో మాత్రం చెప్పరేంటి!

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?

హరికృష్ణ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సింది