cloudfront

Advertisement


Home > Politics - Gossip

రేవంత్ కు కీలక పదవి?

రేవంత్ కు కీలక పదవి?

తెలంగాణ ఎన్నికలలో ఓటమిపాలైన తర్వాత... కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రక్షాళనకు సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి... కేడర్ ను ఎన్నికలకు సిద్ధంచేసే విధంగా అధిష్ఠానం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆ క్రమంలో ప్రస్తుతం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న... రేవంత్ రెడ్డికి ఇంకాస్త పెద్ద పీట వేసే అవకాశం కనిపిస్తోంది.

వివరాల్లోకి వెళితే... రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అందులో తెలంగాణలో పార్టీ ఓటమికి ఒక్కొక్కరూ ఒక్కొక్క కారణాలను ఏకరవు పెట్టారు. రేవంత్ చెప్పిన కారణాలతో రాహుల్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అందుకనే రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడిగా పూర్తి బాధ్యత అప్పగించే అవకాశముందని భావిస్తున్నారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికలు తరువాత జరిగిన పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి, దాదాపు గత ఫలితాలే వచ్చినప్పటికీ... రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో మాత్రం ఆయన తన పట్టు నిలబెట్టుకున్నారు. కొడంగల్ లో 89 పంచాయతీలకు ఎన్నికలు జరగగా... కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 62 పంచాయతీలలో విజయ కేతనం ఎగురవేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా... టిఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు ఇక్కడ కేవలం 16 స్థానాలలోని గెలవడం జరిగింది. తెలంగాణ ఎన్నికలలో పూర్తి పరాభవం తర్వాత కూడా రేవంత్ రెడ్డి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి... ప్రస్తుతం పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పటికీ, ఆయన ఇప్పుడు తనపదవి పట్ల నిరాసక్తత తోనే ఉన్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చెందిన... పిసిసి అధ్యక్ష పదవిని కోరుతున్న మరో ముఖ్య నాయకురాలు... డీకే అరుణకు కూడా ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించడం జరిగింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నాయకుల సమావేశంలో రేవంత్ రెడ్డి వినిపించిన వాదన పట్ల రాహుల్ గాంధీ సంతృప్తి చెందారని... అందుకనే రేవంత్ రెడ్డి నాయకత్వంపై రాహుల్ గాంధీకి నమ్మకం కలిగి ఆయనని తొందరలో తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా నియమించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

రాబోయే సార్వత్రిక ఎన్నికలలో రేవంత్ రెడ్డి లాంటి దూకుడున్న వ్యక్తి చేతుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఎదుర్కొంటే.. మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని... కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

జగన్ ముందు బాబు నిలబడలేరు: వాకా మంజుల