cloudfront

Advertisement


Home > Politics - Gossip

కమలంతోనే కోదండం: అమిత్ షా రాక అందుకేనా?

కమలంతోనే కోదండం: అమిత్ షా రాక అందుకేనా?

ప్రభుత్వ అనుకూల ఓటు టీఆర్ఎస్ కు, వ్యతిరేక ఓటు బీజేపీకి.. అంతే తప్ప ఇంకెక్కడా ఓట్లలో చీలిక రాకూడదనే ఉద్దేశంతోటే అమిత్ షా తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ దళితుడ్ని ముఖ్యమంత్రిని చేయడు, కేవలం తన కొడుకు, కూతురుకే ఆయన పదవులు కట్టపెడతారంటూ కేసీఆర్ విజయాన్ని డిక్లేర్ చేస్తూ మాట్లాడుతున్న అమిత్ షా, మరోవైపు కాంగ్రెస్ పై మాత్రం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.

మహా కూటమి నుంచి కోదండరాంని బయటకు లాగాలనే తెరవెనక అజెండాతోటే అమిత్ షా ముందుకు వెళ్తున్నారనేది స్పష్టమవుతోంది. ఉద్యమ సమయంలో ప్రాణాలర్పించినవారి కుటుంబ సభ్యులు, ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన వారు, యువకులు, విద్యార్థులు.. ఇలా ఓ వర్గంలో టీఆర్ఎస్ పై తీవ్ర అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్త వర్గమంతా పరోక్షంగా టీజేఎస్ పక్షాన నిలబడుతోంది.

సో.. ఈ ఓట్లను కొల్లగొట్టాలంటే కోదండరాం కావాల్సిందే. అంటే మహా కూటమి నుంచి ఆయన్ను బైటకు తేవాల్సిందే. తెలంగాణలో ఇప్పుడిదే జరుగుతోంది. సీట్ల కొట్లాటలో కోదండ బైటకు వస్తే, అతనికి రెడ్ కార్పెట్ పరచి బీజేపీతో కలసి పనిచేసేలా వ్యూహం రచిస్తున్నారు అమిత్ షా.

కాంగ్రెస్ బేరసారాలతో విసుగెత్తిపోయిన కోదండరాం, టీడీపీతో చేతులు కలిపి తెలంగాణ ద్రోహులతో కలిశాడన్న అపవాదుని తలకెత్తుకోవడం ఇష్టంలేని కోదండరాం.. ఎలాగోలా నెపం మహాకూటమిపైనే నెట్టి బయటకు వచ్చేయడానికి డెడ్ లైన్ కూడా పెట్టేశాడు.

భావసారూప్య పార్టీలతో కలసి వెళ్తానని కోదండరాం ఇప్పటికే హింట్ కూడా ఇవ్వడంతో.. బీజేపీ - టీజేఎస్ కొత్త కూటమి తెలంగాణ ఎన్నికల్లో తెరపైకి రావడం దాదాపు ఖాయం. టీజేఎస్ ని కలుపుకొని వెళ్లడానికి బీజేపీ స్థానిక నాయకత్వం కూడా సుముఖంగానే ఉంది. ఇప్పటికే దీనిపై పలు దఫాలు చర్చలు జరిగాయని తెలుస్తోంది.

మరోసారి పూర్తిస్థాయిలో పార్టీ నేతలతో చర్చించి, కోదండరాంకు హామీలిచ్చి తమవైపు తిప్పుకోడానికే ఈ దఫా అమిత్ షా తెలంగాణ పర్యటన ప్రధాన ఉద్దేశమని అంటున్నారు.