cloudfront

Advertisement


Home > Politics - Gossip

కొడంగల్ ఎన్నిక రద్దవుతుందా?

కొడంగల్ ఎన్నిక రద్దవుతుందా?

ఒకసారి మనం వెనక్కి వెళ్లి గుర్తు చేసుకుంటే.. భారీ మొత్తం డబ్బులు నిల్వ ఉంచుకుని ఓటర్లను ఎన్నికల సమయంలో ప్రలోభపెట్టడానికి పార్టీలు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణల మీద జయలలిత మరణం తర్వాత ప్రకటించిన ఉప ఎన్నికను ఎన్నికల సంఘం రద్దుచేసింది. ఆ తర్వాత కొన్ని నెలలకు మళ్లీ నిర్వహించారు. ఆ రకంగా.. ఓటర్లను డబ్బుతో ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణల మీద.. ప్రస్తుతం తెలంగాణలో కొడంగల్ ఎన్నిక కూడా రద్దవుతుందా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో హల్ చల్ చేస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు ప్రధానపాత్ర పోషిస్తుందనే అనుమానం ఉండడంతో... పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎడాపెడా కేసులు నమోదు చేస్తున్నారు. భారీ భారీ మొత్తాల్లో సొమ్ము స్వాధీనం చేసుకుంటున్నారు.

ప్రతిరోజూ కోట్లకు కోట్ల రూపాయలు దాఖలు పడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వ కక్ష కట్టి దాడులు చేయిస్తోందని విపక్షాలు అనడం, మా పార్టీ వారి మీద కూడా దాడులు జరుగుతున్నాయంటూ అధికార పార్టీ సమర్థించుకోవడమూ జరుగుతోంది.

కొడంగల్ విషయానికి వస్తే.. తెరాసకు చెందిన అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి బంధువు శ్రీధర్ రెడ్డి ఫాంహౌస్ నుంచి పోలీసులు, ఏసీబీ అదికారులు 51 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫాంహౌస్ నుంచి ఎవరెవరికి ఎంతెంత సొమ్ము, ఎప్పుడెప్పుడు ఇచ్చారో లెక్కలు రాసిన ఓ పుస్తకాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సదరు ఫాంహౌస్ యజమాని శ్రీధర్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించి.. కొన్ని వివరాలు కూడా సేకరించారు. మండలాల్లోని నాయకులకు, మద్యం సరఫరాకు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరిగిపోయినట్లు, ఖర్చు చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు దొరికిన సొమ్ము ఎన్నికల్లో ఖర్చు చేయడానికి పెట్టుకున్నవే అని ఐటీశాఖ ఎన్నికల సంఘానికి నివేదిక కూడా ఇచ్చేసింది.

ఇలాంటి పరిస్థితుల్లో కొడంగల్ ఎన్నిక రద్దు కావడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రయత్నాలు ఏ పార్టీ అభ్యర్థి ప్రయత్నం చేసినా సరే.. ఆ ఎన్నికను రద్దుచేసి, కొంతకాలం తర్వాత మళ్లీ నిర్వహిస్తున్నారు.

దొరికిన ఆధారాలను బట్టి.. ఇప్పటికే కోట్లకు కోట్ల రూపాయలు ఓట్లకోసం పంపిణీ అయిపోయి ఉన్నట్లుగా ఆధారాలు దొరికిన నేపథ్యంలో కొడంగల్ ఎన్నిక వాయిదా తప్పదని పలువురు విశ్లేషిస్తున్నారు.

ఆ పార్టీకి మినిమం మెజారిటీ గ్యారెంటీ!... ఎందుకో తెలుసా?