cloudfront

Advertisement


Home > Politics - Gossip

కుమారస్వామి ముచ్చటా కొన్ని గంటలేనా?

కుమారస్వామి ముచ్చటా కొన్ని గంటలేనా?

సోమవారమే కుమారస్వామి ప్రమాణ స్వీకారం అని అన్నారు. మళ్లీ ఏమనుకున్నారో ఏమో కానీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని బుధవారానికి మార్చారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి జేడీఎస్‌కు వచ్చిన ఓట్లూ తక్కువే, సీట్లూ తక్కువే. గత ఎన్నికల్లో 40ఎమ్మెల్యేలు జేడీఎస్ తరఫున నెగ్గారు. ఈ సారి 38సీట్లలో జేడీఎస్ నెగ్గింది. ఓట్లు కూడా చాలా వరకూ కోల్పోయింది కుమారస్వామి పార్టీ.

ఇలాంటి నేపథ్యంలో కుమారస్వామి ముఖ్యమంత్రి అవుతూ ఉండటమే కామెడీ. 40సీట్లలో గెలిచినప్పుడు ఎందుకూ కొరగాకుండా పోయిన జేడీఎస్ ఇప్పుడు మాత్రం కింగ్ మేకర్ అయిపోయి, ఏకంగా కింగ్ కూడా అయిపోతోంది. భారతీయ జనతా పార్టీకి అవకాశం దక్కకూడదన్న ఏకైక అజెండాతో సీఎం సీటు ఇస్తామని అంటూ కుమారస్వామి ముందు సాగిలపడింది కాంగ్రెస్ పార్టీ.

సంకీర్ణాల్లో సాధారణంగా పెద్ద పార్టీ ముఖ్యమంత్రి పీఠాన్ని చేపడుతుంది. చిన్న పార్టీ మంత్రి పదవులతో సర్దుకుంటుంది. అయితే కర్ణాటకలో ఎక్కడ బీజేపీ ఛాన్స్ దక్కించుకుంటుందో అనే భయంతో కాంగ్రెస్ పార్టీ కుమారస్వామి మెడ మీద కత్తి పెట్టినట్టుగా సీఎం సీట్లో కూర్చోబెడుతోంది. ఇలా కోరి వచ్చిన పదవిలో కొన్నాళ్లు కూర్చున్నా ఫర్వాలేదన్నట్టుగా కుమారస్వామి కూర్చుంటున్నాడు. బుధవారం ఈయన ముఖ్యమంత్రి అవుతాడు. అయితే ఆ తర్వాత బలపరీక్ష ఉంటుంది.

మొత్తం 224సీట్లున్న కర్ణాటకలో 222స్థానాలకు మొన్న ఎన్నికలు జరిగాయి. వీటిల్లో 104బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. మినిమం మెజారిటీకి 112సీట్లు కావాలి. కాంగ్రెస్ 78ప్లస్ జేడీఎస్ 38 అనుకుంటే, 116 సీట్లు అవుతాయి. వీటిల్లో కుమారస్వామి రెండు సీట్లలో నెగ్గాడు. అలాగని రెండు ఓట్లు ఉండవు. కాబట్టి జేడీఎస్ బలం 115అనుకోవాలి. ఓవరాల్‌గా కనీస మెజారిటీ కన్నా మూడు సీట్ల బలం మాత్రమే ఎక్కువ ఉంది వీళ్ల కూటమికి.

కాబట్టి బలపరీక్ష కూడా అంత ఈజీ వ్యవహారం కాదు. కుమారస్వామి ప్రమాణ స్వీకారం సమయానికి మంత్రి పదవుల విషయంలో కూడా కొంత క్లారిటీ వస్తుంది. అప్పుడు కొందరు నిరాశవహులుగా మారవచ్చు. ఎవరో జేడీఎస్ కు చెందిన వ్యక్తిని సీఎం చేస్తుండటం పట్ల కాంగ్రెస్‌లోనే ఎంతో కొంత అసహనం మొదలవ్వవచ్చు. కాబట్టి కుమారస్వామి ముచ్చట కూడా కొన్ని గంటలేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.