cloudfront

Advertisement


Home > Politics - Gossip

లగడపాటి సర్వేపై కేటీఆర్ సెటైర్లు

లగడపాటి సర్వేపై కేటీఆర్ సెటైర్లు

విజయవాడ మాజీ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ చేసిన తప్పుడు సర్వేకి ఒక వర్గం మీడియా విశేష ప్రచారం కల్పించిందని టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు కెటిఆర్ అన్నారు.

'మేము ప్రభుత్వాలు కూల్చగలం. ప్రభుత్వాలు తేగలం. నాయకులను తయారుచేయగలం. ధ్వంసం చేయగలం అనుకునే మీడియా సంస్థలకు తెలంగాణ ప్రజలు అనేకసార్లు బుద్ధి చెప్పారు.

2006లో కేసీఆర్ కరీంనగర్ లో పోటీ చేసినప్పటి నుంచి డబ్బు బలం, మీడియా బలంతో రకరకాల ప్రచారాలతో తెలంగాణ ప్రజలను అయోమయానికి గురి చేసి.. తెలంగాణను రాకుండా అడ్డుకున్న శక్తులు ఏవైతో ఉన్నాయో వాటిని ప్రజలు ఆనాడే తిరస్కరించారు. మొన్న కూడా అసాధారణమైన, ఆశ్చర్యమైన పరిస్థితులు కనిపించాయి.

క్షేత్రస్థాయిలో వేరే పరిస్థితి ఉంటే.. ప్రజాకూటమిని ప్రజలు గెలిపించారని, టీఆర్ఎస్ పార్టీ దారుణంగా పరాభవం కాబోతుందని.. తాము కూడా కొన్ని సందర్భాల్లో అయోమయానికి గురయ్యే స్థాయిలో ప్రచారాలు చేశారు.

ప్రజలు ఆ ప్రచారాన్ని నమ్మలేదు కానీ.. కాంగ్రెసోళ్లు బలంగా నమ్మారు కాబట్టి పరాజయం నుంచి కోలుకోలేకపోతున్నారు.

ఎందుకు ఓడిపోయామని సమీక్షించుకోకుండా, ఆత్మవిమర్శ చేసుకోకుండా తాము చేసిన ప్రచారాన్ని తామే విశ్వసించి తమ బుట్టలో తామే పడి వారు క్రియేట్ చేసుకున్న మాయ ప్రపంచంలో పడిపోయి గందరగోళంలో ఉన్నారని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కేసీఆర్, బాబు పాలనపై సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే?

వెల్లువెత్తిన అభిమానం మినిష్టర్ క్వార్ట్రర్స్ జామ్ ఎక్కడంటే