cloudfront

Advertisement


Home > Politics - Gossip

బీజేపీతో అవసరం తీరిపోయింది.. ఎవరి దారి వారిది!

బీజేపీతో అవసరం తీరిపోయింది.. ఎవరి దారి వారిది!

ఏపీలో బీజేపీతో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు అవసరం తీరిపోయినట్టుగా ఉంది. గత ఎన్నికల ముందు.. అనూహ్యంగా బీజేపీ నేతలు అయినవాళ్లు.. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఎవరిదారి వారు చూసుకుంటున్నట్టుగా ఉన్నారు. బీజేపీకి రాజీనామాలు మొదలయ్యాయి.

ఇప్పటికే తన భార్యను జనసేనలోకి చేర్చిన రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఇప్పుడు తను ఆ మార్గాన్ని అనుసరిస్తున్నట్టుగా ఉన్నాడు. ఈయన బీజేపీకి రాజీనామా ప్రకటన చేశాడు. బీజేపీకి రాజీనామా చేసి జనసేనలో చేరి రాజమండ్రి నుంచి ఆకుల ఎంపీగా పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.

కేవలం ఆకుల మాత్రమేకాదు.. అటూ ఇటూ చూస్తున్న విష్ణుకుమార్ రాజు కూడా తెలుగుదేశంలోకి చేరడం ఖాయమైనట్టుగా తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు కూడా ఈయన ఆశగా చూశాడు. అయితే అక్కడ ఆశించిన సీటు దొరకకపోవడంతో.. ఈయన తెలుగుదేశం పార్టీలోకి ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.

ఇక మరో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్.. చాన్నాళ్లుగా బీజేపీతో సంబంధాలేమీ లేకుండా ఉన్నాడు. ఈయన బాబు కేబినెట్లో మంత్రిగా ఉన్న రోజుల్లోనే బీజేపీని వీడతాడు.. తెలుగుదేశంలో చేరతాడు అనే ప్రచారం జరిగింది. ఇక ఎన్నికల నాటికి కామినేని తెలుగుదేశం పార్టీలోకి చేరడం లాంఛనమే అని తెలుస్తోంది.

వీళ్లు ముగ్గరూ వీళ్లదారి చూసుకుంటే.. మాణిక్యాల రావు మాత్రం మిగులుతారు. ఆయన కూడా వేరే రూటు చూసుకునే అవకాశాలు లేకపోలేదు. ఓవరాల్ గా ఏపీలో వీరికి బీజేపీతో అవసరం తీరిపోయినట్టుగా ఉంది. 

జనసేన అన్ని స్థానాల్లో పోటీ పవన్ కళ్యాణ్ ధైర్యమేంటి?

అటు జనం.. ఇటు భయం, పవన్ ఒంటరిగా వెళ్లాలి.. ఇదే అభిమానుల కోరిక!