cloudfront

Advertisement


Home > Politics - Gossip

లోకేషూ.. ఈ మాటలు రాహుల్ వింటే!

లోకేషూ.. ఈ మాటలు రాహుల్ వింటే!

‘ఎన్టీఆర్ తో పెట్టుకుని ఇందిరాగాంధీ ఏమయ్యిందో.. చంద్రబాబుతో పెట్టుకున్న మోడీకి కూడా అదే గతి పడుతుంది..” అని అంటున్నాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీమంత్రి నారాలోకేష్. అంటే.. ప్రధాని మోడీని కాల్చి చంపుతారు.. ఇందిరలా ఆయన హతం అయిపోతారు అని లోకేష్ చెప్పదలుచుకున్నట్టుగా ఉన్నాడు.

బతికున్న మనిషిని ఉద్దేశించి నువ్వు దారుణంగా చచ్చిపోతావ్... అది కూడా హత్యకు గురి అవుతావ్.. అన్నట్టుగా మాట్లాడటం ఏమిటో ఈ మంత్రిగారికే తెలియాలి. ఈ మధ్య అటు చంద్రబాబు నాయుడు, ఇటు లోకేష్ బాబు.. ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారు.

తనతో పెట్టుకున్న వాళ్లెవ్వరూ బాగుపడలేదు.. అని ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు హెచ్చరించాడు. ఇటీవలే ఒక  బీజేపీ కార్యకర్తను ఫినిష్ అయిపోతావ్.. అని కూడా బాబు హెచ్చరించాడు. ఇప్పుడు లోకేష్ ఏకంగా ప్రధాని మోడీనే హత్యకు గురవుతాడు.. అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇందిర గతే మోడీకి పడుతుందని చెబుతున్నాడు.

అయినా.. ఈ మధ్యనే ఇందిరది ‘ఘనత” అని లోకేష్ అన్నాడు. ఎన్టీఆర్ ను ఆమె గద్దెదించిందని, ఆ తర్వాత.. ప్రజా వ్యతిరేకతకు జడిసి ఎన్టీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఇందిరదే అని లోకేష్ అన్నాడు. ఇప్పుడేమో ఇందిరకు పట్టిన గతి అంటున్నాడు.

అయినా.. ఒకవైపు కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు నెరుపుతున్నారు తెలుగుదేశం వాళ్లు. ఢిల్లీకి వెళ్లి రాహుల్ కు శాలువాలు కప్పుడుతున్నాడు చంద్రబాబు. మరి ఈ విషయంలో లోకేష్ అప్ డేట్ అయ్యాడో లేదో.. వాళ్ల నాయనమ్మ గురించి ఇలా మాట్లాడితే రాహుల్ ఏ మాత్రం సహించకపోవచ్చు. జాగ్రత్త లోకేష్ బాబూ! ఇప్పుడు టీడీపీకి మిగిలిన ఏకైక ఫ్రెండ్ కాంగ్రెస్ మాత్రమే!

జనసేన అన్ని స్థానాల్లో పోటీ పవన్ కళ్యాణ్ ధైర్యమేంటి?

అటు జనం.. ఇటు భయం, పవన్ ఒంటరిగా వెళ్లాలి.. ఇదే అభిమానుల కోరిక!