cloudfront

Advertisement


Home > Politics - Gossip

నాదారి రహదారి - చినబాబు ఓవరాక్షన్

నాదారి రహదారి - చినబాబు ఓవరాక్షన్

లోకేష్ ని దొడ్డిదారిన ఎమ్మెల్సీగా ఎంపిక చేసి, మంత్రిపదవి కట్టబెట్టారని చంద్రబాబుపై విమర్శలున్నాయి. ఈ విమర్శలను తిప్పికొట్టడానికే అన్నట్టు తనయుడిని ప్రత్యక్ష ఎన్నికల బరిలో దింపారు చంద్రబాబు. అయితే టీడీపీకి పెట్టనికోటగా ఉన్న నియోజకవర్గాన్ని ఎంచుకుంటే మళ్లీ అవే విమర్శలు వస్తాయి. చినబాబు కాబట్టి, ఏరికోరి ఫలానా నియోజకవర్గంలో నిలబెట్టారని, గెలుపు నల్లేరు మీద నడక కాబట్టే సిట్టింగ్ ని బలిచేసి మరీ లోకేష్ కి పట్టంకట్టారని ప్రతిపక్షాలు విరుచుకుపడతాయి.

ఈ విమర్శలన్నిటినీ కాచుకోడానికే ఏరికోరి మంగళగిరిని ఎంపిక చేశారు చంద్రబాబు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో తన కొడుకు సత్తా చూపిస్తారంటూ సవాళ్లు విసురుతున్నారు. లోకేష్ పప్పు కాదు నిప్పు అని చాటి చెప్పడానికే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నచోట రిస్క్ చేశామంటున్నారు చంద్రబాబు. 1985 తర్వాత మంగళగిరిలో ఎప్పుడూ టీడీపీ పోటీ చేయలేదని 29 ఏళ్ల తర్వాత 2014లో పోటీచేసి ఓటమి పాలయిందని, అలాంటి టిపికల్ నియోజకవర్గంలో చినబాబు సత్తా చూపించబోతున్నారంటూ అనుకూల మీడియా కథనాలు వండివారుస్తోంది.

వాస్తవానికి ఈ నియోజకవర్గాన్ని నీరుగార్చింది స్వయంగా టీడీపీనే. అప్పట్లో టీడీపీ తరపున పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులెవరూ ఆసక్తి చూపించకపోవడంతోనే మిత్రపక్షాలకు కేటాయిస్తూ వచ్చింది. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసిన గంజి చిరంజీవి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 12ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇప్పుడీ నియోజకవర్గాన్ని చినబాబు చేతిలోకి తీసుకున్నారు. రాజకీయ ప్రయోజనం మాట అటుంచితే.. కంపెనీల కమీషన్లు, రాజధాని అభివృద్ధి పేరుతో జరిగే దందాల్లో వాటాల కోసమే లోకేష్ మంగళగిరికి వచ్చినట్టు తెలుస్తోంది.

అయితే చంద్రబాబు ఒకటి తలిస్తే.. మంగళగిరిలో పరిస్థితి మరోలా ఉంది. బీసీల ఓట్లు గణనీయంగా ఉన్న మంగళగిరిలో స్థానికంగా పట్టున్న సామాజిక వర్గాన్ని కాదని, లోకేష్ కి సీటివ్వడంతో టీడీపీలో అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. వీటిని చల్లార్చడానికి చినబాబు స్థానిక నేతలందరినీ వారి ఇళ్లకు వెళ్లి మరీ కలిసొచ్చారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ ని వదిలి మైక్ అందుకుని మరోసారి నాలిక మడతబడేసరికి కంగుతిన్నారు లోకష్.

1980 నుంచీ ఇక్కడ టీడీపీ గెలవలేదని, నేను గెలుస్తానో లేదో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. నిజానికి టీడీపీ ఆవిర్భవించింది 1982లో.. మరి అలాంటి పార్టీ 80లో ఎలా గెలుస్తుందో ఆయనే సెలవివ్వాలంటూ ట్రోలింగ్ కి గురయ్యారు లోకేష్. తాను నోరు తెరిస్తే ఎలా ఉంటుందో మరోసారి గుర్తుచేశారు.

అందుకే ఇటీవల కొడుకుని ట్విట్టర్ కే పరిమితం చేశారు చంద్రబాబు. ఇప్పుడు తప్పదు కాబట్టి జనాల్లోకి తెచ్చినా ఆయన తత్తరపాటు మాత్రం మారలేదు. తన మాటలతో లోకేష్ మంగళగిరి వాసుల్ని ఏం చేస్తారో చూడాలి. 

చంద్రబాబు చేసిందే నేను చూపిస్తున్నా.. వర్మ

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!