Advertisement

Advertisement


Home > Politics - Gossip

బాబూ మాలోకం..ఇవే త‌గ్గించుకుంటే మంచిది!

బాబూ మాలోకం..ఇవే త‌గ్గించుకుంటే మంచిది!

'రాజారెడ్డి రాజ్యాంగం..' దాదాపు ఏడాదిన్నర నుంచి నారా లోకేష్ నోటి వెంట త‌ర‌చూ వినిపిస్తున్న మాట ఇది. ట్విట‌ర్ పోస్టుల్లో అయినా, రెండు మూడు నెల‌ల‌కు ఒక‌సారి త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ప్పుడు అయినా లోకేష్ ఈ మాటే చెబుతూ ఉన్నారు. దేశ‌మంతా అంబేద్క‌ర్ రాజ్యాంగం అమ‌ల‌వుతూ ఉంటే, ఏపీలో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగం అమ‌ల‌వుతోంద‌ట‌... ఇది నారా లోకేషుడి వీర ఆరోప‌ణ‌!

ఇంత‌కీ ఎవ‌రీ రాజా రెడ్డి.. జ‌నాలు ఎప్పుడో మ‌రిచిపోయిన వైఎస్ రాజారెడ్డి. వైఎస్ కుటుంబం అయినా రాజా రెడ్డి పేరును మ‌రీ ఇన్ని సార్లు త‌లుచుకుంటుంటుందో లేదో కానీ నారా లోకేష్ మాత్రం.. ఈ త‌రం వారికి ప‌రిచ‌యం లేని రాజా రెడ్డి పేరును ప్ర‌స్తావిస్తూ ఉంటారు. 

ఇలా విమ‌ర్శించేస్తే జ‌గ‌న్ పై త‌ను బీభ‌త్సంగా స్పందించేసిన‌ట్టుగా అవుతుంద‌ని లోకేష్ భావిస్తూ ఉండొచ్చు. అయితే.. టీడీపీ ఏం చేసినా అతిగా ఉంటుంది, ఏం స్పందించినా టంగుటూరి మిరియాల సామెత‌లా ఉంటుంది. ల‌క్ష కోట్లు.. ల‌క్ష కోట్లు అంటూ.. జ‌గ‌న్ ను అధికారానికి దూరంగా ఉంచ‌లేక‌పోయిన పార్టీ టీడీపీ! 

శుక్ర‌వారం శుక్ర‌వారం అంటూ రోజూ మాట్లాడి.. అదే శుక్ర‌వారాల రోజున త‌మ పార్టీ నేత‌ల‌ను అరెస్టు చేస్తున్నారంటూ ఇప్పుడు టీడీపీ గ‌గ్గోలు పెడుతూ ఉంది.

ఇక నారా లోకేష్ విష‌యానికి వ‌స్తే.. 'జ‌గ‌న్ మోదీ రెడ్డి..' అంటూ తెగ ట్వీటారు! 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఏడాది నుంచి జ‌గ‌న్ మోదీ రెడ్డి అంటూ కొన్ని వంద‌ల సార్లు సంబోధించి, అనేక సార్లు ట్వీట్లు కూడా అలా పెట్టారు. తీరా ఏమైంది? 

ఇప్పుడు అదే మోడీ ముందు సాగిలాప‌డ‌టానికి మాలోకం తండ్రిగారు ఎంత‌లా ప్ర‌య‌త్నిస్తున్నారో వివ‌రించ‌న‌క్క‌ర్లేదు. అప్పుడు జ‌గ‌న్ మోదీ రెడ్డి అంటూ తెగ నీలిగిన లోకేష్ ఇప్పుడు అన‌గ‌ల‌డా జ‌గ‌న్ మోదీ రెడ్డి అని? అలాంటి పాత ట్వీట్లన్నింటినీ ఎప్పుడో ప‌ని పెట్టుకుని మ‌రీ డిలీట్ చేసుకుని ఉంటారు.

ఈ ఊస‌ర‌వెల్లి వేషాలు, త‌మ‌ న‌క్క వేషాలూ జ‌నాలు ప‌ట్టించుకోవ‌డం లేదు అని నారా లోకేష్ అనుకుంటూ ఉండ‌వ‌చ్చు. అలా అనుకునే చివ‌ర‌కు ఎమ్మెల్యేగా కూడా నెగ్గ‌లేక‌పోయాడు. అయినా ఇప్పుడు మ‌ళ్లీ కొత్త ప‌దం క‌నుక్కొన్న మేధావిలా రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారు. ఏదైనా అతిగా అన‌డం, అనుచితంగా రియాక్ట్ అయిపోవ‌డం ఆ త‌ర్వాత నాలుక్క‌రుచుకోవ‌డం నారా లోకేష్ బాబుకు అల‌వాటే క‌దా!

మిగతా సీఎం లు ఒక లెక్క, జగన్ ఒక లెక్క

ప్రభుత్వం కడుతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?