cloudfront

Advertisement


Home > Politics - Gossip

చినబాబు మాటల్లో మరీ అంత మూర్ఖత్వమా?

చినబాబు మాటల్లో మరీ అంత మూర్ఖత్వమా?

మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్న చినబాబు నారా లోకేష్... ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నకొద్దీ.. రోజురోజుకూ విపరీతంగా జోకులు పేలుతున్నాయి. మంగళగిరి ప్రజలకు అలవిమాలినంత వినోదాన్ని పంచిపెట్టడానికే నారాలోకేష్ ఎమ్మెల్సీ పదవి తన చెంత ఉంచుకుని కూడా ఎమ్మెల్యేగా బరిలోకి దిగాడా? అనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది.

ఇప్పటిదాకా గుంటూరును ‘గుంత్రు’ అంటూ... మంగళగిరిని మందలగిరి అంటూ ఆయన జనాన్ని నవ్వించారు. నాలుక మందం లెద్దూ.. నోరు తిరగడం లేదు అని సర్దుకోవచ్చు. ఎన్నికల పోలింగ్ 9వ తేదీన అంటూ లోకేష్ కామెడీ చేశారు. ఏదో కుర్రాడు ఫ్లోలో మరచిపోయాడు అనుకోవచ్చు కూడా.

కానీ తాజాగా అంతకంటె భారీగా తన మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటున్నాడా? అనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది. తాజాగా ఆయన మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ... అనేక రకాలుగా అసంబద్ధమైన మాటలు మాట్లాడారు.

కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి ఆంధ్రకు ఎందుకు వస్తున్నారంటే.. అంటూ కారణాలు ఏకరవు పెట్టారు. కేసీఆర్ ఎన్నకల ప్రచారానికి వస్తున్నట్లుగా ఇప్పటిదాకా షెడ్యూలు లేదు. ఒకవేళ రాకపోతే.. ఈ మాటల విలువ ఏమవుతుంది? అనేది ప్రశ్న. ఒకవేళ ఈ పాయింటును విస్మరించినా.. ఆయన చెప్పిన కారణాలు.. మరీ అర్థరహితంగా, మూర్ఖత్వం అనిపించేలా ఉన్నాయి.

  1. పోలవరం నిర్మాణం కాకుండా ఆపడానికి అని ఆయన అంటున్నారు. పోలవరం ఆగిపోవడం వల్ల కేసీఆర్ కు లాభమేమీ లేదు. గోదావరిని మాగ్జిమమ్ ఎంతగా వాడుకోవచ్చో.. అంతగా కేసీఆర్ తెలంగాణలో ప్రాజెక్టులు ప్లాన్ చేసుకుంటున్నారు.
  2. పోలవరం ముంపు మండలాలను తిరిగి తెలంగాణకు తీసుకెళ్లడానికి... అని లోకేష్ అన్నారు. ఏపీలో చంద్రబాబు ఓడిపోతే.. లేదా జగన్ గెలిస్తే.. ముంపు మండలాలు తిరిగి తెలంగాణకు ఎలా వెళ్తాయి. అవేమైనా జగన్ సొత్తా? ఇంత అర్థం లేకుండా లోకేష్ ఎలా మాట్లాడుతున్నాడో తెలియడం లేదు.
  3. వాటన్నిటినీ మించిన మరో పాయింటు కూడా ఉంది.. కేసీఆర్ మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తీసుకెళ్లడానికి అహర్నిశలూ కృషి చేస్తున్నారని కూడా చినబాబు సెలవిచ్చారు. పోర్టును తెలంగాణకు తీసుకువెళ్లడం ఏమిటో... ఎలాగో ఆ దేవుడికే తెలియాలి.

చినబాబు తెలివితేటలకు మరింత పెద్ద నిదర్శనం ఏంటంటే... జగన్ కు ఓటు వేయవద్దంటూ.. లోకేష్ ప్రజలను బెదిరించడానికి చెప్పిన ఈ మూడు కారణాలతోనూ మంగళగిరి నియోజకవర్గానికిక ఏ రకంగానూ సంబంధం లేదు. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీచేస్తూ... అందులోనూ ఒక రూరల్ మండలం దుగ్గిరాలలో.. గ్రామీణ ప్రజలను ఉద్దేశించి.. వారికి ఏమాత్రమూ సంబంధం లేని.. మాటలు మాట్లాడుతున్నాడంటే.. లోకేష్ ది మూర్ఖత్వం కాక మరేమవుతుంది. అని ప్రజలు అనుకుంటున్నారు.