cloudfront

Advertisement


Home > Politics - Gossip

మంత్రిగారికి ఓటమి తప్పదు.. ఇంకో సీటు కావాలి!

మంత్రిగారికి ఓటమి తప్పదు.. ఇంకో సీటు కావాలి!

జమ్మలమడుగు ఫిరాయింపుదారుడు, మంత్రి ఆదినారాయణ రెడ్డికి గట్టిగానే ఎదురుగాలి వీస్తోందని సమాచారం. నియోజకవర్గంలో మంత్రిగారి పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి బరిలోకి దిగితే ఓటమి తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో జగన్‌ ఇమేజ్‌ మీద జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి బయటపడ్డాడు. ఇక గెలవగానే కొన్నాళ్లకే ఫిరాయించేశాడు. మంత్రిపదవిని కూడా పొందాడు. అలా అవకాశవాది అనిపించుకున్నాడు. ఫిరాయింపుదారుడిగా విమర్శలను ఎదుర్కొన్నాడు.

మరి అలాంటి పనిచేసి అయినా ఆదినారాయణ రెడ్డి కామ్‌గా ఉన్నాడా అంటే అదీలేదు. జగన్‌ మీద అడ్డగోలుగా మాట్లాడుతూ వచ్చాడు. ఫిరాయించడమే తీవ్రమైన విమర్శలకు అవకాశం ఇచ్చిన విషయం. అంతగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలని అనిపిస్తే వైసీపీ నుంచి దక్కిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సింది. కానీ ఆది అది చేయలేదు. ఆపై జగన్‌ మీద అడ్డగోలుగా మాట్లాడుతూ వచ్చాడు.

ఇది ఆదినారాయణ రెడ్డి పట్ల చాలా వ్యతిరేకతనే పెంచింది. జనాలు కాస్తైనా న్యాయాన్యాయాలు ఆలోచిస్తారు కదా. మరీ అడ్డగోలుగా వ్యవహరిస్తే అది ఎవరినైనా జనాలు క్షమించరు. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి పరిస్థితి అదే అని తెలుస్తోంది.

దీంతో ఆదికి కూడా వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి కష్టం అని తేలిందట. మొన్నటివరకూ నియోజకవర్గంలో వైసీపీ వాళ్లను అడుగుపెట్టనీయకుండా బలవంతాన ఆపుతూ వచ్చాడు. అయితే అది సాధ్యపడదని తేలిపోయింది. జమ్మలమడుగులో వైసీపీ మళ్లీ కార్యకాలాపాలతో పుంజుకుంది. ఆది మీద వ్యతిరేకత వైసీపీలో మరింత కసిని పెంచింది.

ఇక వచ్చేసారి ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీగా పోటీచేయించాలని చంద్రబాబు కూడా అనుకుంటున్నాడట. అయినా ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా.. జమ్మలమడుగులో పొడచలేని ఆది ఏకంగా కడప ఎంపీ సీటు పరిధిలోని ఎమ్మెల్యే సీట్లన్నింటిలోనూ పొడిచేస్తాడా!

తెలంగాణ ఓటరు నాడి... ముళ్లు ఎటువైపు తిరుగుతోంది?... చదవండి గ్రేట్ ఆంధ్ర పేపర్