cloudfront

Advertisement


Home > Politics - Gossip

మీడియాకు కనిపించని జనగోదారి

మీడియాకు కనిపించని జనగోదారి

ఈ రాష్ట్ర ప్రజలు గొర్రెల మందల్లాంటి వారని, తాము ఎటు అదిలిస్తే అటు వెళ్తారని ఆంధ్రలోని ప్రధాన దినపత్రికలు, చానెళ్ల ప్రగాఢ నమ్మకం. మోడీ మంచోడు అంటే మంచోడు అని, చెడ్డోడు అంటే చెడ్డోడు అని తాము ఎలా చాటింపు వేస్తే అలా జనం నమ్ముతారని వాటి విశ్వాసం. కేవలం తెలుగుదేశం ప్రభుత్వాన్ని పదికాలాల పాటు కాపాడడం కోసమే తమ మీడియా ఉధ్భవించిందని వాటి అనుమానం. ఎప్పటికీ జగన్ అనేవాడు ముఖ్యమంత్రి కాకుండా సకల శక్తులూ కూడదీయడమే వాటి ప్రధాన లక్ష్యం.

వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరిలోకి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశించింది. మొత్తం రహదారి, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి అంతా జనసంద్రమే అయింది. కానీ పాపం, దేశం అనుకూల మీడియాకు అస్సలు కనిపించలేదు. ‘దేశం’ కోసం చొక్కా విప్పుకుని మరీ పూనకం వచ్చినట్లు ఊగిపోయే ఓ దినపత్రిక అస్సలు ఆ ఫొటో ప్రచురించనే లేదు. లోకల్ పత్రికలో మాత్రం చిన్న క్లోజప్ ఫోటో వేసి ఊరుకుంది. మరో పత్రిక తాము వేసాము అనిపించుకోవడం కోసం లోపలి పేజీల్లో ఓ చిన్న ఫోటో వేసి ఊరుకుంది.

కానీ ఈ మీడియా సంస్ధలకు తెలియాల్సింది ఒక్కటే. ఈ పత్రికలు మార్కెట్ లోకి వచ్చేలోగానే, జనం వెల్లువలా తరలి వచ్చిన ఫోటోలు, వీడియోలు వాట్సప్ లో హల్ చల్ చేసాయి. ఫేస్ బుక్ లో తెగ ట్రెండింగ్ అయ్యాయి. మన కోడి కుంపటి లేకుంటే తెల్లారదు అనుకునే రోజులు మారిపోయాయి. అసలు ఈ మీడియా ఏం అనుకుంటోంది? తాము దాచేస్తే దాగిపోతుంది అని అనుకుంటోందా? గోదారి రోడ్ మీదకు వచ్చిన లక్షలాది జనానికి తెలియదా? ఎంత మంది వచ్చారో? గోదావరి జిల్లాల జనానికి తెలియదా? ఎంతమంది వచ్చారో?

వీళ్లు చేయగలిగింది ఒక్కటే గోదావరి జిల్లాలో తరలి వచ్చిన జన గోదారి పక్క జిల్లాలకు తెలియకుండా మీడియాను అడ్డం వేయడం. కానీ వాట్సప్ ను, ఫేస్ బుక్ ను ఎవరు అడ్డం వేయగలరు? జనాలకు కూడా ఈ మీడియా సంగతి అర్థం అయిపోయింది. వారు కూడా వాటిల్లో ఈ విధమైన ఫొటోలు వస్తాయని ఆశించడం లేదు. ఇలాంటి బాపతు మీడియాకు తెలంగాణలో ముకుతాడు వేసి కూర్చోపెట్టాడు కేసిఆర్. అందుకే అక్కడ దేశం ఆటలు సాగడం లేదు. ఆంధ్రలో ప్రస్తుతానికి సాగుతోంది. భవిష్యత్ లో ఏమవుతుందో?