cloudfront

Advertisement


Home > Politics - Gossip

మీడియా మీద బాబు గోల ఏంటీ?

మీడియా మీద బాబు గోల ఏంటీ?

తనదాకా వస్తే కానీ తెలియదని సామెత. జగన్ మాట్లాడితే లోపలి పేజీల్లో సింగిల్ కాలమ్. బాబు మాట్లాడితే బ్యానర్. అదీ ఆంధ్రలో ప్రధాన ప్రింట్ మీడియా తంతు. ఇప్పుడు జగన్ కు అవుతున్న అనుభవం ఢిల్లీలో బాబుగారికి ఎదురైంది. బాబుగారు ఢిల్లీలో హడావుడి చేయబోతే మీడియా పట్టించుకోలేదట. అందుకే బాబుగారు చిందులు తొక్కుతున్నారు. మీడియాకు మోడీ అంటే భయం అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 90శాతం మీడియా ఎటువైపు వుంటుంది అంటే రాష్ట్రంలో ఎవరైనా సమాధానం చెబుతారు. 

ముప్పాతిక శాతం ప్రింట్ మీడియా, వెబ్ మీడియా, విజువల్ మీడియా, చొక్కాలు విప్పుకుని మరీ బాబు కోసం పని చేస్తాయన్న సంగతి తెలిసిందే. ఓపెన్ గా జగన్ పనికిరాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు. చంద్రబాబే ముద్దు. ఆయనే రావాలి అని ప్రధాన మీడియా అంతా నేరుగా టముకేసింది. అయినా బాబుగారు ఇంకా మీడియా మీద నిందలు వేస్తూనే వున్నారు.

ఎన్నికల అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లైవ్ లో, 'మీకు(జర్నలిస్ట్ లు) వాళ్లంటే (మోడీ, కేసీఆర్, జగన్), ఉచ్చ పోసేసుకుంటారు. మీకు తెలియకుండా పంట్లాలు తడిసిపోతాయి' అన్నారు. కానీ అది అంతగా జనాలకు పట్టలేదు అది వేరే సంగతి. మళ్లీ ఈరోజు కూడా బాబుగారు మీడియా మీదపడ్డారు.

ఢిల్లీలో ఆయన హల్ చల్ చేయడానికి ప్రయత్నిస్తే పట్టుమని పది సెకెండ్లు కూడా చూపించలేదట నేషనల్ మీడియా. దాంతో మళ్లీ ఆయన అదే రాగం అందుకున్నారు. మీడియాకు మోడీ అంటే భయం, ఢిల్లీలో పరిస్థితి దారుణంగా వుంది, తెలంగాణలో మరీనూ. మీడియా నోరెత్తే పరిస్థితి లేదు. ఇక్కడ (ఆంధ్ర)లో కాస్త నయం అంటూ చెప్పుకొచ్చారు. అంటే ఆయన కోసం బట్టలు విప్పుకుని, ఆయనే కావాలి. ఎన్ని యుగాలైనా తెలుగుదేశం మాత్రమే కావాలి అనే మీడియా టముకేస్తే మంచిది. అలా కాకపోతే భయం అన్నమాట.

అదే విషయం కేసీఆర్ కూడా అనవచ్చు కదా? ఆంధ్రలో బాబు అంటే మీడియాకు భయం, అందుకే ప్రధాన పత్రికలు, చానెళ్లు బాబుకు కొమ్ము కాస్తాయి. బాబుకే ఓటు వేయండి, జగన్ కు వద్దు అని నేరుగా కాలమ్ లు రాస్తాయి అని. అప్పుడు బాబు ఏమంటారో?

ఏమైనా అందరూ చెబుతున్నది ఇటు చేసి, అటు చేసి ఒకటేమాట. మీడియా స్వంతంత్రంగా వ్యవహరించడం లేదు. మొత్తంమీద తేలేది అదే. 

జనసేనకు పడ్డ ఓట్లలో 80 టీడీపీ, 20 వైసీపీ ఓట్లని అంచనా!