Advertisement


Home > Politics - Gossip
మోడీ, చంద్రబాబు 'మిత్రబంధం' తెగిందా?

'తుమ్మితే ఊడిపోయే ముక్కు' చందాన తయారయ్యింది ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ - బీజేపీ మధ్య 'స్నేహం'. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా ఇది నూటికి నూరు పాళ్ళూ నిజం. రెండు పార్టీలకీ కొన్ని అవసరాలున్నాయి, ఆ అవసరాల నేపథ్యంలోనే పొత్తు కొనసా గుతోంది. ఇంతకుమించిన గట్టి బంధమైతే ఇరు పార్టీల మధ్యా కన్పించడంలేదు. సరే, రాజకీయాలన్నాక పొత్తులు చిత్తవడం కొత్త విషయమేమీ కాదు.

కొన్ని స్నేహాలు రోజులు, నెలల్లోనే పెటాకులై పోతుంటాయి. కొన్ని స్నేహాలు పెటాకులైపోయినాసరే, తప్పనిసరై కొనసాగుతుంటాయి. ఇక్కడ బీజేపీ - టీడీపీ మధ్య స్నేహం కూడా 'తప్పనిసరి' పరిస్థితుల్లోనే కొనసాగుతోందని చెప్పక తప్పదు. తెర వెనుక గొడవలు ఎలా వున్నా, పైకి మాత్రం 'మేమింకా మిత్రులమే' అన్న సంకేతాలు ఇరు పార్టీల నుంచీ వస్తున్నాయి. కానీ, గడచిన ఏడాది కాలంలో ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌, ముఖ్యమంత్రి చంద్రబాబుకి దొరకడంలేదన్న మాట, ఇప్పుడు రాజ కీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది.

ఎంతైనా, చంద్ర బాబు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. పైగా, ఎన్డీయేలో భాగస్వామి. ఆ లెక్కన, ప్రధాని నరేంద్రమోడీ, చంద్రబాబుకి అపాయింట్‌మెంట్‌ ఎప్పుడు కావాలంటే, అప్పుడు ఇచ్చి వుండాలి. కానీ, ఇవ్వడంలేదు. అబ్బే, ఇవ్వకపోవడం కాదు.. చంద్రబాబే అడగడంలేదన్న వాదన టీడీపీ నేతలనుంచి విన్పిస్తున్నా.. అది బుకాయింపు మాత్రమే.

చిచ్చుపెట్టింది పోలవరమేనా.?

మొన్నామధ్య పోలవరం ప్రాజెక్ట్‌కి సంబంధించి చంద్రబాబు, అసెంబ్లీలో అంతలా గుస్సా అవడానికి కారణం, ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్‌ ఆయనకు దొరక్కపోవడమేనట. పోలవ రంపై చంద్రబాబు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ, కేంద్రం 'కొర్రీలు' పెడుతూ వస్తోంది. అప్పుడప్పుడూ, ఉపశమనం కల్గించే మాటలూ చెబుతోందండోయ్‌. మాటలు కాదిక్కడ, చేతలు కావాలి. ఆ విషయం చంద్రబాబుకి బాగా తెలుసు. కానీ, ఆయన గట్టిగా అడగలేరు.

అడిగినా, కేంద్రం పట్టించుకోదు. ఇలా సాగుతోంది మోడీ - చంద్రబాబు మధ్య స్నేహం. 'పార్టీల మధ్య మైత్రి వుంది.. అంతకు మించి మోడీకీ నాకూ మంచి స్నేహం వుంది..' అని చంద్ర బాబు చాలా సందర్భాల్లో చెప్పుకున్నారుగానీ, ఆ 'స్నేహం' తాలూకు లక్షణాల్ని ఏనాడూ నరేంద్రమోడీ ప్రదర్శించింది లేదు. ప్రతిపక్షం నుంచి ఎవరన్నా అపాయింట్‌మెంట్‌ కోరితే, ప్రధాని నుంచి వ్యతి రేకత రావడంలేదట.

దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలకీ ప్రధాని అపాయింట్‌మెంట్‌ తేలిగ్గానే దొరుకుతోంది. మరి, చంద్రబాబెందుకు నరేంద్రమోడీని కలవడానికి ఏడాదికిపైగానే సమ యం తీసుకున్నట్టు.? ఇది కాస్త ఆలోచించాల్సిన విష యమే. గతంలో వెంకయ్యనాయుడు, రాజకీయాల్లో యాక్టివ్‌గా వుండేవారు. పైగా కేంద్ర మంత్రి. అన్నిటికీ మించి బీజేపీ సీనియర్‌ నేత కావడంతో, చంద్రబాబు ఆయన ద్వారా నరేంద్రమోడీ అపా యింట్‌మెంట్‌ పొందగలిగేవారు. ఇప్పుడు సీన్‌ మారింది. వెం కయ్య, ఉపరాష్ట్రపతి అయ్యారు. 

దాంతో, చంద్రబాబుకి ఇంకో ఆప్షన్‌ లేకుండా పోయింది. పోనీ, కేంద్రంలో టీడీపీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు అశోక్‌ గజపతి రాజు, సుజనా చౌదరి వున్నారు కదా.. వారన్నా, చంద్రబాబుకి మోడీ అపాయింట్‌మెంట్‌ ఇప్పించలేకపోతున్నారేంటీ.! అన్న అను మానం కలగడం సహజమే. వారికి, ఢిల్లీలో అంత ప్రాపకం లేద న్నది సర్వత్రా విన్పిస్తోన్న అభిప్రాయం. అందుకే మోడీ - చంద్ర బాబు కలయికకి జరుగుతోంది ఇంతటి జాప్యం. ఈసారీ కేంద్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు కిందా మీదా పడ్డారు చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ కోసం.

మోడీని బాబు కలిస్తే మాత్రం.. ప్రయోజనమేంటి.?

ప్రధాని నరేంద్రమోడీతో, చంద్రబాబుకి అపాయింట్‌ దొరికినంత మాత్రాన ఇదివరకటి స్నేహ సంబంధాలను గుర్తుపెట్టుకుని, చంద్రబాబు కోరికల్ని నరేంద్రమోడీ మన్నిస్తారా.? రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, విభజన చట్టంలోని అంశాలపై సానుకూలంగా స్పందిస్తారా.? ఛాన్సే లేదు. మోడీ ఏం చేయాలను కుంటున్నారో అదే చేస్తారు తప్ప, చంద్రబాబు లాంటోళ్ళ మాటలతో ఆయన అస్సలేమాత్రం ప్రభావితమయ్యే అవకాశమే లేదన్నది ఢిల్లీ నుంచి అందుతోన్న 'లీకుల' సారాంశం. మోడీని చంద్రబాబు కల వడం, ఆ తర్వాత మీడియా ముందుకొచ్చి చంద్రబాబు, హడా విడి చేయడం ఇదంతా షరా మామూలు తతంగమే.

ఢిల్లీ టూర్‌ని దాదాపుగా ఖరారు చేసుకున్నాక చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాశారు. అందులో ప్రత్యేక ప్యాకేజీ సహా పలు అంశాల్ని ప్రస్తావించారు. అక్కడికేదో ఈయనగారు ఢిల్లీ వెళ్ళేసరికి, అరుణ్‌ జైట్లీ మొత్తం అన్ని విషయాలపైనా క్లారిటీ తెచ్చుకుని, ఆ క్లారిటీని చంద్రబాబుకి ఇచ్చేస్తారన్నట్టు నడుస్తోంది వ్యవహారం. మొత్తమ్మీద, టీడీపీ - బీజేపీ 'మైత్రి' విషయంలో బీజేపీ అధిష్టానానికి ఓ క్లారిటీ వుందన్నది నిర్వివాదాంశం. టీడీపీతో బంధం బీజేపీకి, ముఖ్యంగా మోడీకి అవసరం లేదు. తెగ్గొట్టుకోవడం ఇష్టం లేక చంద్రబాబు పాకులాడుతోంటే, జస్ట్‌ మోడీ అలా చూసీ చూడనట్టు వ్యవ హరిస్తున్నారంతే.

- సింధు