cloudfront

Advertisement


Home > Politics - Gossip

మోడీ వీరవిధేయుడి చేతిలోనే కన్నడ మంత్రదండం!

మోడీ వీరవిధేయుడి చేతిలోనే కన్నడ మంత్రదండం!

కర్నాటకలో ప్రస్తుతం రాజకీయం మొత్తం రాజ్‌భవన్ కు చేరింది. అక్కడ ఇప్పుడున్న గవర్నర్ పేరు వాజుభాయి వాలా! ఆయన అంతగా పాపులారిటీ ఉన్న నాయకుడు కాదు. కానీ భాజపా వారి ఏలుబడిలో గవర్నర్ గిరీలో ఉండడానికి అన్నివిధాలుగా అర్హుడు. ఎందుకంటే.. ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వీరవిధేయుడు.

ఇంతకంటె ఏం అర్హత అవసరం ఉంటుంది? పైగా, ఆయన 2002లో గుజరాత్ లో మోడీ ముఖ్యమంత్రి కావడానికి అనుకూలంగా తన సొంత నియోజకవర్గాన్ని వదులుకున్న త్యాగశీలి వాజుభాయి వాలా! ఆ తర్వాత మోడీ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగానూ చేశారు. ఆయన ప్రధాని అయ్యాక.. తన వీరవిధేయుడికి గవర్నర్ గిరీ కట్టబెట్టారు. ఇదంతా చరిత్ర.

వర్తమానంలోకి వస్తే...

అలాంటి వీరవిధేయుడి చేతిలో ఇప్పుడు నిర్ణయాధికారం ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలా? లేదా, ఫలితాల అనంతరం పొత్తులు కుదుర్చుకున్న వారిని సంఖ్యాబలం ఆధారంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలా? అనేది ఆయన ఇష్టం. ‘ఇలాగే’ చేయాలనే చట్టం ఏదీ లేకపోయినప్పటికీ.. సాంప్రదాయం పాటించడానికి సాధారణంగా ప్రిఫరెన్సు ఇస్తారు.

పైగా ఆయన మోడీ వీరవిధేయుడు అనేది తెలిసిన సంగతే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన మోడీ అభీష్టానికి వ్యతిరేకంకగా నిర్ణయం తీసుకునే అవకాశంలేదు. ప్రస్తుతానికి ఆయన చేతిలోనే మంత్రదండం ఉంది. అది సాంప్రదాయాన్ని పాటించే ప్రకటనతో నిర్ణయం తీసుకుంటుంది. దానిని తమకు అనుకూలంగా మలచుకోవడం ఎలాగో తతిమ్మా మోడీ కోటరీ చూసుకుంటుంది.

ఒకసారి భాజపా ప్రమాణ స్వీకారం చేయగలిగితే చాలు.. బల నిరూపణ అనేది వారికి పెద్ద కష్టతరమైన విద్యకాదని పలువురు అంచనా వేస్తున్నారు.