cloudfront

Advertisement


Home > Politics - Gossip

వైఎస్ కు నివాళి.. వైఎస్సార్సీపీలోకి ఎప్పుడు?

వైఎస్ కు నివాళి.. వైఎస్సార్సీపీలోకి ఎప్పుడు?

తమ కులం వాళ్ల కార్తీక మాస వన భోజనాల్లో పాల్గొన్నాడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. అక్కడ హాజరైన వాళ్లు ముందుగా వైఎస్ కు నివాళి ఘటించే ప్రోగ్రామ్ ను పెట్టుకున్నారు. ఈ తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా వైఎస్ కు నివాళి ఘటించాడు. తెలుగుదేశంలో ఉండాలని అనుకుంటే రెడ్లు ఎవరైనా వైఎస్ ను తిట్టాల్సిందే. అందుకు ఉదాహరణ పల్లె రఘునాథ రెడ్డి లాంటివాళ్లు. మీడియా కనిపిస్తే వైఎస్ మీద, జగన్ మీద విరుచుకుపడతాడు పల్లె. అదే తెలుగుదేశంలో ఆయనకు ఇంత చోటు కల్పిస్తోంది. సోమిరెడ్డి సంగతి సరేసరి.

వారికి భిన్నంగా మోదుగుల వైఎస్ కు నివాళి ఘటించాడు. అంతేకాదు.. చంద్రబాబు పాలనలో ఏపీలో రెడ్లు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నారని మోదుగల అన్నాడట. గురజాలలో కాసు మహేశ్ ను గెలిపించాలని కూడా మోదుగుల పిలుపునిచ్చినట్టుగా సమాచారం.

మోదుగుల కుటుంబ సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈయన మాత్రం తెలుగుదేశంలో కొనసాగుతూ ఉన్నాడు. ఇక తాజా వన భోజనాల్లో వైఎస్సార్సీపీలోకి త్వరలోనే చేరతానని కూడా మోదుగుల వ్యాఖ్యానించినట్టుగా సమాచారం.

ఆ పార్టీకి మినిమం మెజారిటీ గ్యారెంటీ!... ఎందుకో తెలుసా?