cloudfront

Advertisement


Home > Politics - Gossip

పవన్ కు చేతకాలేదు.. నాదెండ్ల చేసేశారు!

పవన్ కు చేతకాలేదు.. నాదెండ్ల చేసేశారు!

ఒక పార్టీలో ఎవరైనా ముఖ్య నాయకులు చేరుతున్నారంటే... దానికి సంబంధించి ఎంతోకొంత హడావిడి తప్పక ఉండి తీరాల్సిందే. ఒక మోస్తరు నాయకులు పార్టీల్లో చేరుతున్నా సరే.. సాధారణంగా చాలా ఆర్భాటంగా సదరు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఫలానా నాయకుడు, తమ పార్టీలో చేరడాన్ని ప్రపంచం మొత్తం గుర్తించేలా.. తద్వారా తమ పార్టీకి ఆదరణ పెరుగుతున్నదని ప్రచారం లభించేలా ఇలాంటి కసరత్తు ఉంటుంది. గతంలో ఎన్నికల భారీ బహిరంగసభలను మరపించే స్థాయిలో, పార్టీ చేరిక సభలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితేన వపన్ కల్యాణ్ రూటే సెపరేటు. ఆయన ఇప్పటిదాకా ఎన్నడూ పార్టీలో చేరికల సందర్భంగా గట్టిగా చెప్పుకోగల కార్యక్రమాన్ని నిర్వహించింది లేదు. ఎంతలావు నాయకులు వచ్చి తమతో చేరినా సరే... పార్టీ ఆఫీసులో కండువా కప్పేయడమూ... పొద్దువాలిపోతున్న వేళ ఓ ప్రెస్ నోట్ ను మీడియా వాళ్లందరకూ పంపేయడమే తప్ప.. చేరికలను ఒక కార్యక్రమంగా.. అందరూ తలతిప్పి తమవైపు చూసే విధంగా నిర్వహించడం పవన్ కల్యాణ్ కు ఎన్నడూ చేతకాలేదు.

పెద్ద నాయకులు వచ్చినప్పుడు కూడా కనీసం  మీడియానైనా పిలవకుండా, ప్రెవేటు కార్యక్రమంలా నిర్వహించి, ప్రెస్ నోట్ పంపేసే పార్టీ బహుశా జనసేన మాత్రమే అయి ఉంటుంది. కానీ.. ఇప్పుడు సీన్ మారుతోంది. పవన్ కల్యాణ్ కు కార్యక్రమం, సభ రూపంలో గట్టిగా పనిచేయడం ఎందుకు ఇష్టంలేదో గానీ.. ఇప్పుడు ఆ పనిని కొత్తగా పార్టీకి పెద్దదిక్కుగా అవతరించిన నాదెండ్ల మనోహర్ చేసేస్తున్నారు.

నిజానికి నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరిన సందర్భమే చాలా సింపుల్ గా జరిగిపోయింది. అలాంటిది.. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో... పార్టీలో ఎవరైనా నాయకులు చేరుతుంటే.. ఆ సభలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. రాజమండ్రిలో ఓ నాయకుడు పార్టీలోకి వస్తోంటే.. ఆయన పవన్ కల్యాణ్ సమక్షంలో చేరలేదు గానీ.. ఆయనను చేర్చుకోవడానికి రాజమండ్రికి నాదెండ్ల వారే తరలివెళ్లారు.

ఆయన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ఆ పిమ్మట భారీ బహిరంగ సభ కూడా జరిగాయి. మొత్తానికి నాదెండ్ల రూపంలోనైనా... పార్టీ కార్యక్రమం కాస్త ఘనంగా నిర్వహించే వాతావరణం ఏర్పడిందని, పార్టీని యాక్టివేట్ చేసిన తర్వాత... ఇన్నాళ్లుగా పవన్ కల్యాణ్ కు చేతకాని ఇమేజిని నాదెండ్ల తీసుకువస్తున్నాడని పార్టీలోనే అనుకుంటున్నారు.

జనసేన అన్ని స్థానాల్లో పోటీ పవన్ కళ్యాణ్ ధైర్యమేంటి?

అటు జనం.. ఇటు భయం, పవన్ ఒంటరిగా వెళ్లాలి.. ఇదే అభిమానుల కోరిక!