cloudfront

Advertisement


Home > Politics - Gossip

నాగబాబు పోటీకి నో?

నాగబాబు పోటీకి నో?

ఇటీవల కొంతకాలంగా వార్తల్లో కనిపిస్తున్న మెగాబ్రదర్ నాగబాబు ఎన్నికల బరిలోకి దిగుతారని వార్తలు గుప్పుమన్నాయి. నరసాపురం అంటూ నియోజకవర్గం కూడా ఫిక్స్ చేసేసారు. కానీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ ఎన్నికల బరిలోకి నాగబాబు దిగడంలేదట. ఎన్నికల్లో పోటీకి సరిపడా ఆర్థిక స్థోమత కానీ, ఆసక్తి కానీ లేవని ఆయస స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

కానీ ప్రచారంలో పాల్గొనడం, జనసైనికులతో కలిసి పనిచేయడం మాత్రం ఆసక్తిగా చేస్తానని సోదరుడు పవన్ కు నాగబాబు చెప్పనట్లు తెలుస్తోంది. ఈసారి మెగా ఫ్యామిలీ నుంచి కానీ బంధువులు గానీ ఎవ్వరూ బరిలో వుండరని, కేవలం పవన్ మాత్రమే ఎన్నికల బరిలోకి దిగుతారని వినిపిస్తోంది.

ఇదిలావుంటే గాజువాక నుంచి పోటీనే సేఫ్ ప్లేస్ అని పవన్ భావిస్తున్నట్లు బోగట్టా. గతంలో ఇది ప్రజారాజ్యం గెలిచిన చోటు కాబట్టి అదే సరైన ప్లేస్ అని టాక్. అయితే పవన్ ఎక్కడయినా గెలుస్తారు కాబట్టి, దాన్ని చింతలపూడి వెంకట్రామయ్యకే వదిలేసి, పవన్ ఈస్ట్ లేదా వెస్ట్ నుంచి పోటీచేస్తే బెటర్ అని, ఏలూరు అయితే ఇంకా మంచిదని జనసేన వర్గాల్లో వినిపిస్తోంది.

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

బాబుది ఎదురుదాడే.. నిజాన్ని ఎదుర్కొనలేరు!