cloudfront

Advertisement


Home > Politics - Gossip

లోకేష్ పై పోటీకి ఎన్టీఆర్ మామ?

లోకేష్ పై పోటీకి ఎన్టీఆర్ మామ?

ముందు భీమిలి అన్నారు. తర్వాత విశాఖ నార్త్ అన్నారు. మధ్యలో మరో 2 నియోజకవర్గాల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఎట్టకేలకు లోకేష్ కు ఓ నియోజకవర్గాన్ని వెదికిపెట్టారు చంద్రబాబు. అన్ని లెక్కలు వేసుకొని, కొడుక్కి మంగళగిరి అయితేనే సేఫ్ అని ఫిక్స్ అయ్యారు. రాజధాని ప్రాంతం ఉన్న నియోజకవర్గం కాబట్టి ఎలాగోలా గెలిపించుకోవచ్చని భావించారు. కానీ బాబు ఆశలపై జగన్ నీళ్లు చల్లారు.

అవును.. లోకేష్ కు పోటీగా ఆయన బంధువునే బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావును మంగళగిరి స్థానం నుంచి వైసీపీ తరఫున నిలబెట్టాలని జగన్ ఆలోచిస్తున్నారట. ఇదే కనుక జరిగితే మంగళగిరి స్థానంలో ఎన్నిక, బంధువుల మధ్య పోటీగా మారుతుంది. ఎన్టీఆర్ మామ శ్రీనివాసరావు, తాజాగా వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.

నిజానికి మంగళగిరి నియోజకవర్గం టీడీపీది కాదు. ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ వ్యక్తి. గత ఎన్నికల్లో కేవలం 12 ఓట్ల తేడాతో గెలిచారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. 12 ఓట్లు మాత్రమే తేడా కాబట్టి ఈసారి అతడ్ని ఈజీగా ఓడించొచ్చని చంద్రబాబు భావించారు.

పైగా రాజధాని అభివృద్ధి, రైతుల భూమల త్యాగం అంటూ ఇప్పటికే కహానీలు వినిపిస్తున్నారు కాబట్టి విజయం ఈజీ అనుకున్నారు. కానీ జగన్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా నార్నే శ్రీనివాసరావును లోకేష్ పై పోటీకి దించాలని భావిస్తున్నారట.

శనివారం అభ్యర్థుల జాబితాను ప్రకటించబోతున్నారు జగన్. ఈ లిస్ట్ లో నార్నే శ్రీనివాసరావు పేరు ఉంటుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. జాబితా ప్రకటన అనంతరం ఆయన మరోసారి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనకు సిద్ధమౌతున్నారు.

ఆర్-ఆర్-ఆర్ ప్రెస్ మీట్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి 

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!