Advertisement

Advertisement


Home > Politics - Gossip

కేసీఆర్ కు నాలుగు పాదాభివందనాలు!

కేసీఆర్ కు నాలుగు పాదాభివందనాలు!

మొత్తం ఆరుమందికి కొత్తగా తన కేబినెట్లో చోటు ఇచ్చారు కేసీఆర్. వారిలో ప్రమాణ స్వీకారం అనంతరం నలుగురు కేసీఆర్ కు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. తద్వారా తమ కృతజ్ఞతను కూడా తెలుపుకున్నారు. ఒకవేళ పెద్దాయనగా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకొంటూ పాదాభివందనం చేస్తే అది ఓకే. అయితే కేవలం కృతజ్ఞతగా పాదాభివందనాలు మాత్రం అంత మెచ్చుకునేవి కావు ప్రజాస్వామ్యంలో.

అయితే ప్రమాణ స్వీకారం చేసి, కేసీఆర్ కు పాదాభివందనం చేసిన వారిలో ఆయన కొడుకు, మేనల్లుడు ఉన్నారు కాబట్టి అవి ఆశీర్వాదాలే అనిచెప్పాలి. ప్రమాణ స్వీకారం అనంతరం హరీష్ రావు, కేటీఆర్ లు కేసీఆర్ కు పాదాభివందనం చేశారు. ఇక మంత్రి అయిన సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ లు కూడా పాదాభివనందం చేశారు. వారిని కేసీఆర్ ఆశీర్వదించారు. అయితే గంగుల కమలాకర్ పాదాభివందనం చేయబోగా.. కేసీఆర్ వారించారు.

ప్రమాణ స్వీకారం చేసిన ఆరుమందిలో పాదాభివందనం చేయని, ఆ ప్రయత్నం జోలికి వెళ్లనివారు సబితా ఇంద్రారెడ్డి. ఒకవేళ ఆమె ఆ ప్రయత్నం గట్రా చేసి ఉంటే.. అది విడ్డూరంగానే ఉండేది చూసే జనాలకు కూడా. అలాంటి అతి ప్రయత్నాలు చేయకుండా.. సబిత అటు కేసీఆర్ ను కూడా ఇబ్బంది పెట్టలేదు.

జగన్‌ పాలన.. 'హాఫ్‌' మార్కును చేరిన అభినందనలు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?