cloudfront

Advertisement


Home > Politics - Gossip

శ్రీనివాసరావు.. ఎన్ఐఏ అదుపులోకి వెళ్తే అప్పుడు!

శ్రీనివాసరావు.. ఎన్ఐఏ అదుపులోకి వెళ్తే అప్పుడు!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం నిందితుడు శ్రీనివాసరావును తమ కస్టడీకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ ఆధీనంలోని ఎన్ఐఏ కోరడం ఆసక్తిదాయకంగా మారింది. ఇప్పటి వరకూ శ్రీనివాసరావు రాష్ట్ర పోలీసుల ఆధీనంలోనే ఉన్నాడు. శ్రీనివాసరావు విషయంలో ఏపీ పోలీసుల తీరుపై వైసీపీ అనుమానాలు వ్యక్తంచేస్తూనే ఉంది.

జైల్లో కూడా శ్రీనివాసరావుకు రాజభోగాలు అందుతున్నాయనే మాట వినిపిస్తోంది. అక్కడ శ్రీనివాసరావు సేవకు ఇద్దరు బిహారీ ఖైదీలను పెట్టారనేమాట కూడా వినిపిస్తోంది. శ్రీనివాసరావుకు నాన్ వెజ్ భోజన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇలా సంక్రాంతి అల్లుడిలా శ్రీనివాసరావును ఏపీ పోలీసులు చూసుకుంటున్నారనే మాట మీడియా వర్గాల్లో వినిపిస్తూ ఉంది. ఇక శ్రీనివాసరావు ఏదో పెద్ద రచయిత అయినట్టుగా.. అతడు పుస్తకాన్ని రాస్తున్నాడనే లీకులను కూడా ఇచ్చారు. బహుశా జగన్ మీద తనకెంత అభిమానం ఉందో శ్రీనివాసరావు పుస్తకం రాస్తాడేమో!

ఉన్నది ఏపీ పోలీసుల కస్టడీలో కాబట్టి వాడిచేత ఏమైనా రాయించవచ్చులే! ఇక శ్రీనివాసరావును ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంటే.. అప్పుడు కథ మరో మలుపు తిరిగే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రీనివాసరావు కస్టడీని కోరుతూ.. ఎన్ఐఏ కోర్టులో మెమో దాఖలు చేసింది.

దానిపట్ల న్యాయస్థానం సానుకూలంగా స్పందిస్తే.. శ్రీనివాసరావును ఎన్ఐఏ విచారించే అవకాశాలుంటాయి. అప్పుడు ఈ వ్యవహారం ఒక కొలిక్కి రావొచ్చు. అదెలా ఉంటుందనేదే చూడాలిక!

జగన్‌తో పవన్‌ పొత్తు ఎందుకు కుదరలేదంటే?

టికెట్ దక్కకపోతే డబ్బులు మిగులుతాయ్!