Advertisement

Advertisement


Home > Politics - Gossip

'నిమ్మగడ్డ'- నిస్పాక్షికత

'నిమ్మగడ్డ'- నిస్పాక్షికత

రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా ఇగోలకు పోవడం అన్నది కామన్. రాజకీయ పార్టీలు పంతాలకు పోవడం మామూలే. కానీ అధికారంలో వున్నవారికి పంతాలు, ఇగోలు వుండకూడదు. ఎందుకు వుండకూడదు అని క్వశ్చను చేయడం సులువే. 

రాజ్యాంగబద్దమైన పదవుల్లో వున్నవారు నిబంధనలకు అనుగుణంగా నడుచుకొవడం వరకు పంతాలకు పోవచ్చు. శేషన్ లాంటి ఎన్నికల అధికారి వచ్చే వరకు ఎన్నికల కమిషన్ విశేషాధికారాలు జనానికి తెలియలేదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఎన్నికల అధికారి కూడా నిబంధనలను, అధికారాలను వ్యక్తిగతంగా తీసుకోలేదు. 

ఆంధ్ర ఎన్నికల కమిషనర్ పూర్తి స్వతంత్రంగా వ్యవహరించడం వేరు. కావాలని కసిగా వ్యవహరించడం వేరు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ చాలా కసిగా, వ్యక్తిగతంగా తీసుకున్నట్లు వ్యవహరిస్తున్నారని ఆయన వైఖరి గమనించిన వారికి తెలిసిపోతోంది. 

సకాలంలో ఎన్నికల జరపకపోతే నిధులు రావు అన్న సంగతి, ఆ చింత ఆయనకు ఎంత వుంటుందో, ప్రభుత్వాన్ని నడిపే నేతలకు అంతే వుంటుంది అన్న సంగతి గమనించడం లేదు. నిజానికి చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడన్నా సకాలంలో స్థానిక ఎన్నికలు జరిపిన ఉదంతం వుందా? మరి అప్పట్లో ఈ నిధుల సంగతి ఏం చేసారు. 

పోనీ అప్పుట్లో నికార్సయిన అధికారులు లేరు. నిమ్మగడ్డ నికార్సయిన అధికారి అనుకుందాం. ప్రభుత్వం ఎన్నికలకు సహకరించకుండా, రాజ్యాంగపరంగా ఆయన ఏం చేయగలరో అవి చేయాలి కానీ కోర్టులో లక్షలకు లక్షలు ఖర్చు చేసి పోరాటం చేయడం ఎంత వరకు సబబు. 

గవర్నర్ కు ఫిర్యాదు చేయొచ్చు. రాష్ట్రపతికి ఫిర్యాదు చేయొచ్చు. ఇలా ఖర్చు లేని దారులు వెదకవచ్చు. కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా సవాల్ చేస్తాను, పై కోర్టుకు, ఆ పై కోర్టుకు వెళ్తాను అంటే కచ్చితంగా జనం ఈ వైఖరి మీద అనుమాన పడాల్సి వుంటుంది. 

నిజానికి ఈ పరిస్థితిలో వున్న ఏ అధికారి అయినా, తన ప్రయత్నం తాను చేసాను అని అక్కడితో వదిలేయాలి. కానీ నిమ్మగడ్డ ఈ మొత్తం వ్యవహారాన్ని పర్సనల్ గా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందుకే మళ్లీ అప్పీల్ కు వెళ్తున్నారని వార్తలు అందుతున్నాయి.

ఇక్కడ ఓ చిన్న లాజిక్ పాయింట్ వుంది. ఎన్నికలు జరపడం కోసం ప్రభుత్వం పై ఇంతలా పోరుసలుపుతూ, మొత్తం వ్యవహారాన్ని తన పర్సనల్ ఇగో క్లాష్ అన్నట్లుగా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ హయాంలో నిజంగా లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే, అవి నిస్పక్షపాతంగా జరుగుతాయని భావించడానికి అవకాశం ఏ మేరకు వుంది అసలు? అన్నది ఆలోచించాలి. 

ఆ ఒక్క పాయింట్ చాలు, ప్రభుత్వం ఎలాగయినా ఈ ఎన్నికలు జరగకుండా ఎందుకు అడ్డం పడుతోందన్నది అర్థం కావడానికి..

దేవుడిపై ప్రేమ ఉన్నట్టుగా డ్రామాలాడుతున్నారు

విక్ర‌మార్కుడు కంటే ప‌వ‌ర్ పుల్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?