Advertisement

Advertisement


Home > Politics - Gossip

మొన్నటి ప్రధానమంత్రి అభ్యర్థిని పూర్తిగా సైడేశారు!

మొన్నటి ప్రధానమంత్రి అభ్యర్థిని పూర్తిగా సైడేశారు!

నితిన్ గడ్కారీ.. ఆర్ఎస్ఎస్ కు ముద్దుబిడ్డ. సంఘ్ నుంచి వచ్చి భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్ష బాధ్యతలు  తీసుకున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ బాధ్యతల్లో ఉన్నారు. ఆ సమయంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా ప్రచారం పొందారు. అయితే అప్పుడు బీజేపీకి కాలం కలిసిరాలేదు.

తర్వాత గడ్కరీకి ప్రాధాన్యత తగ్గింది. ప్రత్యేకించి మోడీ ప్రధాని అభ్యర్థి అయ్యాకా ఆయనకు ప్రాధాన్యత తగ్గింది. అయితే ఆయనకు కీలకమైన మంత్రి పదవులు ఇవ్వక తప్పలేదు. అందుకే తొలిసారి మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ సంఘ్ నేతకు ఉపరితల రవాణాతో పాటు జల రవాణాశాఖ బాధ్యతలు కూడా ఇచ్చారు. ఒకదశలో మళ్లీ గడ్కరీకి కాలం కలిసి వచ్చిందనే ప్రచారం జరిగింది.

బీజేపీలో మోడీ వ్యతిరేక ట్రూపుకు గడ్కరీ దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయని, మోడీ వ్యతిరేకత ప్రబలితే గడ్కరీనే ప్రధాని అభ్యర్థిగా ప్రకటిచారని.. గడ్కరీకి చంద్రబాబు కూడా సపోర్ట్ చేయబోతున్నారని.. రకరకాల ప్రచారాలు సాగాయి. అయితే అవేవీ జరగలేదు. గడ్కరీ కూడా ఒకటీ రెండుసార్లు ఘాటుగా మాట్లాడారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు.

ఇప్పుడు విశేషం ఏమిటంటే.. బీజేపీ వాళ్లు ఆయనను సైడేశారు. ఒకవైపు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ బీజేపీ సీనియర్ మరాఠా నేతకు పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదని స్పష్టం అవుతోంది. టికెట్లను ఖరారు చేయడంలో కానీ, మరే విషయంలో కానీ.. గడ్కరీకి అస్సలు ప్రాధాన్యతను ఇవ్వలేదని సమాచారం.

ప్రత్యేకించి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు గడ్కరీ అస్సలు పడటం లేదట. అలాగే జాతీయ రాజకీయాల్లో అమిత్ షా, మోడీల కన్నా గడ్కరీ చాలా సీనియర్. గత పరిణామాల నేపథ్యంలో వారు ఆయనకు ప్రాధాన్యతను ఇచ్చే అవకాశాలే లేవు. ఇప్పుడు అదే జరుగుతూ ఉందట.

కేవలం నాగ్ పూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం గడ్కరీతో రోడ్ షోలు నిర్వహింపజేస్తున్నారట. ఎన్నికల వేళ ఆయన రేంజ్ లు కేవలం అరవై అసెంబ్లీ సీట్ల పరిధిలో ప్రచారానికి మాత్రమే పరిమితం చేశారట. అదేమంటే ఆయన జాతీయ నేత అని, హర్యానాలో కూడా ఆయన ప్రచారం చేయాల్సి ఉందని కమలం పార్టీ వాళ్లు మీడియాకు చెబుతున్నారు.

ఇది మరింత దెప్పి పొడుపులా ఉంది. ఒకదశలో పార్టీ జాతీయాధ్యక్షుడిగా, పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా వ్యవహరించిన వ్యక్తిని ఇప్పుడు నాగపూర్ సిటీకి పరిమితం చేయడం చర్చనీయాంశంగా మారింది.

నీ తెలుగు కంటే నేనే మేలు.. హాట్ యాంకర్ డైరెక్టర్ చిట్ చాట్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?