Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఇక బురద చల్లడానికి నో ఛాన్స్ !

ఇక బురద చల్లడానికి నో ఛాన్స్ !

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సెప్టెంబరు 1 నుంచి రాతపరీక్షలు జరగబోతున్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికల విషయంలో ఎలాంటి అనుమానాలకు, విమర్శలకు తావులేకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇంటర్వ్యూల ద్వారా ఎంపికచేసే, మార్కులు వేసే పద్ధతి ఉంటే.. వైకాపా వారికి మాత్రమే ఉద్యోగాలు దోచిపెట్టారని ఆరోపణలకు దిగే అవకాశం ఉంటుంది. అందుకు ఆస్కారమే లేకుండా, విపక్షాలు బురద చల్లేందుకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు కేవలం రాతపరీక్షలను మాత్రమే నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ పరీక్షలు రాస్తున్నారు. జగన్మోహన రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. నిరుద్యోగులకు కల్పిస్తున్న అద్భుతమైన అవకాశం ఇది. రాష్ట్రమంతా ఉద్యోగాలు ఇస్తున్నారు. చిన్న ఉద్యోగాలే అయినా.. నిలకడైన ఉద్యోగాలకు రూపకల్పన చేశారు.

అయితే జగన్మోహన రెడ్డి సర్కారు వైకాపా కార్యకర్తలకే ఉద్యోగాల పందేరం చేయడానికి కుట్ర చేస్తున్నదంటూ తెలుగుదేశం చవకబారు విమర్శలకు దిగింది. వీటిని ఖాతరు చేయకుండా ప్రభుత్వం ముందుకెళుతోంది. ఇంటర్వ్యూలతో ఎంపికలు చేస్తే అయినవారికి కట్టబెట్టారనే విమర్శలకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కేవలం రాతపరీక్షలే పెడుతున్నారు. పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజాశంకర్ ప్రకటించిన దాన్ని బట్టి.. ఇంతకంటె పారదర్శకంగా పరీక్ష నిర్వహించడం కూడా సాధ్యం కాదన్నట్లుగా కనిపిస్తోంది.

ఓఎంఆర్ షీట్ ద్వారా.. పరీక్ష నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు పరీక్ష రాశాక ఓఎంఆర్ షీట్ కాపీని తమవెంట తీసుకువెళ్లే అవకాశం కూడా ఉంది. పైగా పరీక్ష రోజు సాయంత్రమే కీ కూడా విడుదల చేసేస్తారు. ఉదయం పరీక్ష రాస్తే సాయంత్రానికి తమకు ఎన్ని మార్కులు వస్తాయో.. తమకు ఉద్యోగార్హత దక్కుతుందో లేదో కూడా వారికి క్లారిటీ వచ్చేస్తుంది. అక్రమాలకు పాల్పడ్డారు, దొడ్డి దారిన నియామకాలు చేపట్టారు అనే తరహాలో ఎలాంటి ఆరోపణలు వినిపించకుండా ఉండేలా... ఈ చర్యలు తీసుకుంటున్నారు.

అక్టోబరు 2 గాంధీజయంతి నాటినుంచి ఎంపికైన వారంతా కొత్త ఉద్యోగాల్లో చేరుతారు. పరీక్షలు పూర్తయిన మూడువారాల్లోనే ఉద్యోగాల్లోకి కూడా చేరిపోవడం బహుశా కొత్త చరిత్ర కావచ్చు కూడా.

'బాహుబలి' ఇంకా కలగానే ఉంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?