cloudfront

Advertisement


Home > Politics - Gossip

మహాకూటమి.. ఈ మాత్రం దానికి పొత్తు ఎందుకు?

మహాకూటమి.. ఈ మాత్రం దానికి పొత్తు ఎందుకు?

మహాకూటమి సీట్ల పంచాయితీ ఎంతకూ తేలడంలేదు. ఇప్పటికే చర్చలు ప్రారంభం అయ్యి నెలరోజులు గడుస్తున్నా ఈ వ్యవహారం ఇంకా కొలిక్కి రావడంలేదు. ఉన్న సీట్లలో ఎవరికి వారు తమకు కావాలనుకుంటున్న సీట్ల నంబర్లను చెబుతూ ఉన్నారు. ఈ కూటమిలో తొందరగా సర్దుకుపోయింది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఎన్నో కొన్ని సీట్లు ఇస్తేచాలని తెలుగుదేశం పొత్తుకు ఓకే చెప్పింది.

ఇక కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం అయితే చాలా ఈజీగా సర్దుకుపోయింది కానీ.. సీపీఐ, టీజేఎస్ లు మాత్రం ఎంతకూ బెట్టు వీడటంలేదు. అలాగని వీళ్లేమీ మరీ ఎక్కువ సీట్లు అడగడం లేదు. అందరిదీ సింగిల్ డిజిట్ల బేరమే. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ వీళ్లతో ఆటాడుతూ సమయం వ్యర్థం చేసుకొంటూ సాగుతోంది.

రెండు మూడు సీట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మరీ ఇలా మంకుపట్టు పట్టడం విశేషమే. ఇక నామినేషన్లకు మరెంతో సమయం లేదు. ఇప్పటికే తెరాస దూసుకుపోతోంది. అయితే మహాకూటమిలో మాత్రం సీట్ల పంచాయితీ తెగలేదు. తెగేలాలేదు.

మరో అప్ డేట్ ఏమిటంటే... మహాకూటమిలోని పార్టీలు ఫ్రెండ్లీ పోటీకి కూడా రెడీ అంటున్నాయట. తమకు కాంగ్రెస్ పార్టీ కేటాయించిన సీట్లతో పాటు మరికొన్నింటిలో పోటీ చేస్తామని.. ఫ్రెండ్లీ పోటీ అని కోదండరాం అంటున్నట్టుగా సమాచారం. మరి ఈ మాత్రం దానికి పొత్తులు ఎందుకో! సీపీఐ కూడా పొత్తుతో నిమిత్తం లేకుండా కొన్ని సీట్లలో పోటీ చేస్తానని అంటోందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ తప్పులేదు.. అంతా డైరెక్టర్లదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్